కేసిఆర్ కు దమ్ముంటే ఓయూ కు రావాలి (వీడియో)

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ కార్యక్రమానికి రాకుండా అడ్డుకట్ట వేయడం పై ఓయు స్టూడెంట్స్ మండిపడుతున్నారు. వందేళ్ల యూనివర్శిటీ చరిత్రలో ఎందరో నాయకులు ఉస్మానియాకు వచ్చారని అంటున్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేత ఉస్మానియాకు వస్తే తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఎందుకంత భయం అని ఉస్మానియా జెఎసి నేత, టిపిసిసి అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత ప్రశ్నించారు. కేసిఆర్ గతంలో ఉస్మానియాకు వచ్చి సభల్లో పాల్గొనలేదా అని ప్రశ్నించారు. 

కేసిఆర్ కు దమ్ముంటే ఉస్మానియాకు వచ్చి చూడాలని సవాల్ చేశారు. వందేళ్ల ఉత్సవాల్లో మాట్లాడనీయలేదని రాహుల్ గాంధీని అడ్డుకుంటారా అని నిలదీశారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన మీడియా సమావేశంలో పున్న కైలాస్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన బైట్ కింద వీడియోలో ఉంది చూడండి.