ఆంక్షల మధ్యే ఓయూలో విద్యార్ధి నిరుద్యోగ ఆవేదన సభ జరిగింది. ఆర్ట్స్ కళాశాల సభా వేదిక వద్దా మైక్ లేకుండా సభను భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా లైబ్రరీ నుండి విద్యార్ధులు రాకుండా పోలీసులు అడ్డుకున్నా పోలీసులు గో బ్యాక్ అంటూ భారీ సంఖ్యలో సభకు ఓయూ విద్యార్దులు హాజరయ్యారని విద్యార్ధి నేతలన్నారు. సీఎం కేసీఆర్ లాగా విస్కీ సీసాలు పంచకున్నా మండుటెండలో కూర్చోవడానికి కార్పెట్ లేకున్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కటిక నేలపై కూర్చొని విద్యార్ధులు ప్రసంగం విన్నారని నేతలు తెలిపారు. విద్యార్ధుల నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
నీ ప్రగతి నివేదన కాదురా… నీ నాలుగున్నరేళ్ల పాలనలో మా ఆవేదన చూడరా అంటూ విద్యార్ది నిరుద్యోగుల నినాదాలతో ఉస్మానియా సభా ప్రాంగణం దద్దరిల్లింది. సభా ప్రాంగణంలోకి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఆకస్మాత్తుగా ప్రవేశించడంతో పోలీసులు అవాక్కయ్యారు. హాన్మంతరావు ప్రసంగం ముగిసిన తర్వాత తేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చేలోపు సభను ఆపి విద్యార్ధి నేతలైన కోటూరి మానవతారాయ్, రెహామాన్, చనగాని దయాకర్, ఎస్. నాగేశ్వరరావు, ఓరుగంటి కృష్ణ, జనార్ధన్, శ్రీకాంత్, తదితర విద్యార్దులను పోలీసులు అరెస్టు చేయడంతో సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
నాలుగున్నరేళ్లు విద్యార్ధి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి ఎన్నికల కోసం ఎన్ని వరాలు కురిపించినా ఎవరూ నమ్మరని జోనల్ వ్యవస్థలో నిరుద్యోగులకు అన్యాయం చేసి రాష్ట్ర క్యాడర్ ఉద్యోగాలను ప్రత్యక్ష పద్దతిలో నోటిఫికేషన్ ద్వారా కాకుండా పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పలు అంశాలను సవరించకుంటే సీమాంధ్ర ప్రభుత్వం పై 14 F ఆందోళన చేసినట్టు సీఎం కేసీఆర్ పై ఉద్యమిస్తామని తెలంగాణ విద్యార్ధి నిరుద్యోగ జేఏసి చైర్మన్ ఐక్యవిద్యార్ధి సంఘాల నేత కోటూరి మానవతా రాయ్ హెచ్చరించారు. టిఆర్ ఎస్ మ్యానిఫేస్టో లో 610 జీవో ద్వారా 80 వేల సీమాంధ్ర అక్రమ ఉద్యోగాల సంగతి కేసీఆర్ తేల్చాలన్నారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజన కోసం వేసిన కమల్ నాథన్ కమిటీ, పోలీసు విభజన కోసం వేసిన విజయ్ కుమార్ ఐసీఎస్ కమిటీ ఏమైందో కెసీఆర్ ప్రగతి నివేదన సభలో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చని కేసీఆర్ ని రానున్న ఎన్నికల్లో గద్దె దింపుడు ఖాయమని మావవతారాయ్ హెచ్చరించారు.
విద్యార్ధులను అరెస్టు చేస్తున్న ఫోటోలు కింద ఉన్నాయి చూడండి.