వందేళ్ల చరిత్ర.. ఉద్యమాలకు పుట్టినిల్లు.. ఎందరికో చదువును నేర్పి ఉన్నత స్థానంలో ఉండేలా తీర్చిదిద్దిన ఉస్మానియా విద్యాలయంలో రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండాకు అవమానం జరిగింది.
ఓయూ ఆర్ట్స్ కాలేజి బిల్డింగ్ పై యూనివర్సిటి అధికారులు శనివారం70వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే ఆ జెండా మధ్యలో సగం చినిగిపోయి ఉంది. జెండా ఆవిష్కరణ తర్వాత అక్కడ ఒక్క సారిగి కలకలం రేగింది. చినిగిన జెండాను గుర్తించిన విద్యార్దులు ఆందోళనకు దిగారు. కనీసం జెండా ఎలా ఉందో చూసుకోకుండా ఎగురవేయడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని గమనించిన అధికారులు వెంటనే మరో జెండాను ఏర్పాటు చేశారు.
జెండావిష్కరణ తర్వాత జరిగిన కార్యక్రమంలో కూడా పదే పదే మైకులు మొరాయించాయి. యూనివర్సిటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్ధుల, విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారులు వారికి సర్ధిచెప్పి ఆందోళన విరమింపచేశారు. సాక్షాత్తు యూనివర్సిటిలో జాతీయ జెండాకు అవమానం జరగడం పై తెలంగాణ అంతటా చర్చనీయాంశమైంది.