టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ సీటులో ఈసారి ఫైట్ మరింత టఫ్ గా మారే చాన్స్ ఉందా? వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ లో పట్టు బిగిస్తున్నారా? కేసిఆర్ వ్యూహాలు, హరీష్ మంత్రాంగం సైతం వంటేరు మీద నిలబడే చాన్స్ లేదన్న వాతావరణం ఉందా? దళపతి కోటలో వంటేరు ప్రతాప్ రెడ్డి బలమేంటి? స్టోరీ చదవండి. గజ్వేల్ నియోజకవర్గంలో సంచలనం రేపిన వీడియో కూడా కింద ఉంది చూడండి.
2014 ఎన్నికల్లో కేసిఆర్ గజ్వేల్ లో పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మద్దతుతో అప్పటి టిడిపి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మీద అత్తెసరు ఓట్లతో (20వేల లోపు ఓట్లతో) కేసిఆర్ గెలిచారు. ఆ తర్వాత గజ్వేల్ ను తెలంగాణలో ఎక్కడా లేని రీతిలో అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు కేసిఆర్. గజ్వేల్ పట్టణానికి రింగ్ రోడ్డు మంజూరు చేశారు. తన దత్తత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారు.
ఇవన్నీ నాణానికి ఒకవైపు కానీ ప్రాజెక్టుల భూ నిర్వాసితులు పట్టు వదలని విక్రమార్కుల వలే పోరాడుతున్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులు తమకు న్యాయం జరగలేదని ఆందోళనతో ఉన్నారు. టిఆర్ఎస్ పట్ల వ్యతిరేక భావనతో ఉన్నారు. మల్లన్న సాగర్ కింద గజ్వేల్ లోని ఎర్రవల్లి, సింగారం గ్రామాల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి భూములు ప్రభుత్వానికి అప్పగించారు. కానీ గ్రామాన్ని ఖాళీ చేయడంలేదు. వారంతా తమకు ఇచ్చిన హీమీలు అమలు చేస్తేనే గ్రామాన్ని ఖాళీ చేస్తామంటున్నారు.
మరోవైపు కొండ పోచమ్మ కింద మామిడ్యాల, బైలంపూర్, దాంతోపాటు మరో చిన్న గ్రామం నిర్వాసిత జాబితాలో ఉన్నాయి. వీరు కూడా ఆందోళన చేస్తున్నారు. టిఆర్ఎస్ సర్కారు మీద ఆగ్రహంగా ఉన్నారు. అలాగే గజ్వేల్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయినోళ్లు కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అదేకాకుండా గజ్వేల్ ను అద్భుతంగా మార్చేస్తామని, గజ్వేల్ రూపు రేఖలు మారిపోతాయని ప్రకటనలు చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆశించిన రీతిలో పనులు లేవు. దీంతో జనాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం మర్పడగ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి ఊరు ఊరంతా కలిసొచ్చింది. జనాలు అపూర్వ స్వాగతం పలికారు వంటేరుకు. కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ తాలూకు వీడియో కింద ఉంది. జనాలు ఎంతగా విరగబడి వచ్చారో చూడండి. ఆడవాళ్లు బతుకమ్మలతో స్వాగతం పలికారు.
కేసిఆర్ రెండు చోట్ల పోటీ నిజమేనా ?
గులాబీ దళపతి కేసిఆర్ రానున్న ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సమాచారం చక్కర్లు కొడుతున్నది. మరి కేసిఆర్ ఎందుకు అలాంటి ఆలోచన చేస్తున్నారన్నదానిపై క్లారిటీ అయితే రాలేదు. మేడ్చల్ లో కేసిఆర్ పోటీ చేయవచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. కానీ ఈ ప్రచారంపై టిఆర్ఎస్ నేతలు ఎక్కడా స్పందించడంలేదు. అధికారికంగా ఇది నిజమని కానీ, అబద్ధమని కానీ ప్రకటించలేదు. అయితే గజ్వేల్ లోనే పోటీ చేస్తే రేపు ఏదైనా తేడా వస్తే ఇబ్బంది లేకుండా ఉండేందుకే, సేఫ్ జోన్ లో ఉండేందుకు కేసిఆర మరో నియోజకవర్గంలో కూడా పోట ీచేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.