ఎంతోకాలం నుండి అత్త, కోడలు మధ్య ఉన్న వైరం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. కొందరు ఆడపిల్లలు పెళ్లి చేసుకొని పుట్టినిల్లు వదిలి అత్తారింటికి వచ్చిన తర్వత అక్కడ భర్త, అత్త, మామలు పెట్టె భాదలను భరిస్తూ ఉంటె మరికొందరు కోడళ్ళు మాత్రం అత్త మామ లను ముప్ప తిప్పలు పెడుతున్నారు. దేశం ఇంత అభివృద్ధి చెందిన కూడా ఈ అత్త,కోడళ్ళ వైరం మాత్రం తగ్గలేదు. ఇలా అత్త కోడల మధ్య గొడవ కారణంగా కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రాణాలు తీయటానికి వెనుకాడకపోగా మరి కొంతమంది బాధలు భరిస్తూ జీవించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కోడలు మీద ఒక అత్త పెట్రోల్ పోసిన ఘటన కలకలం రేపుతుంది.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో నివాసం ఉంటున్న బొడ్డు శంకర్ కుమార్తె కీర్తనను అదే గ్రామానికి చెందిన కురటి పండరికి ఇచ్చి ఇరు కుటుంబాల అంగీకారంతో 2021లో వివాహం చేశారు. అయితే వివాహం జరిగినప్పటినుంచి మెట్టిని ఇంట్లో అత్తగారి వేధింపులు మొదలయ్యాయి. అత్తా కోడలు ఇద్దరు తరచూ గొడవ పడుతూ ఉండటంతో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా కూడా అత్త కోడలు మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో కీర్తన భర్త పండరితో కలిసి హైదరాబాద్ పనికోసం వలస వెళ్లింది. ఇటీవల కీర్తన అత్త అంబవ్వ పొలం పనులు ఉన్నాయని చెప్పి వారిని ఇంటికి పిలిపించింది. ఇటీవల కీర్తన భర్త పండరి పొలం పనులకు వెళ్లగానే పథకం ప్రకారం అంబవ్వ తన కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటింది.
అయితే కీర్తన పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా కీర్తన మంటల్లో కాలిపోతోంది. వెంటనే స్థానికులు మంటలు అర్పీ కీర్తన తండ్రికి సమచారం అందించారు. కీర్తన తండ్రీ శంకర్ వెంటనే ఆమెని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితురాలు తండ్రి శంకర్ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గ్రామస్థులను విచారించి కీర్తన అత్త కురటి అంబవ్వను జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ రాజు తెలిపారు.