ఎంత కష్టమొచ్చింది.? ‘జాగృతి’ పేరుతో తెలంగాణ ఉద్యమంలో తనవంతు కీలక పాత్ర పోషించిన కవిత, తన తండ్రి కేసీయార్ చలవతో ఎంపీ అయ్యారు.. ఎమ్మెల్సీగా అవకాశమూ దక్కించుకున్నారు.. ఇప్పుడేమో అనూహ్యంగా లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోయారు.
ప్రస్తుతానికైతే సాక్షిగా మాత్రమే కవితను సీబీఐ విచారించిందట. కానీ, ముందు ముందు కథ మారబోతోందిట. కవిత జైలుకు వెళ్ళే అవకాశముందన్న ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది. ఏదీ, ఇంకా సీబీఐ తన విచారణను పూర్తి చేయకుండానే.? కవితను జైలుకు పంపాలన్న అత్యుత్సాహం గులాబీ శ్రేణుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
గతంలో తమిళనాడుకి చెందిన కనిమొళి జైలుకెళ్ళరు.. ఆ కనిమొళితో కవితను పోల్చుతున్నారు. ‘ఆమెపై రాజకీయ కక్ష సాధింపుల వల్లే అలా జరిగింది.. ఇప్పుడు ఈ విషయంలోనూ అలాగే జరగబోతోంది’ అని గులాబీ శ్రేణులు జోస్యం చెబుతున్నాయి.
కాగా, ఎమ్మెల్సీ కవితను ‘ధ్వంసం చేసిన ఫోన్ల’ గురించి సీబీఐ ప్రధానంగా ప్రశ్నించిందట. ఇంతకీ, ఈ ఫోన్ల గోలేమిటి.? నానా రకాల రాజకీయ విమర్శలూ కవిత చేస్తున్నారుగానీ, ఆ మొబైల్ ఫోన్ల వ్యవహారం గురించి మాట్లాడటంలేదు. ఫోన్లు ధ్వంసమైపోయాయని సీబీఐ, ఈడీ చెబుతున్న దరిమిలా.. వాటి జాడ దొరికే అవకాశమే లేదు.
ఆధారాల్లేకుండా ఈ కేసులో ఎంత గింజుకున్నా ముందడుగు పడటం కష్టమే కదా.?