మోదీని చూసి కేసిఆర్ భయపడుతున్నారు: ఎమ్మెల్యే రాజా సింగ్

raja singh

శివసేన రెబల్ ఎంపీ ఏకనాథ్ షిండే.. ఉద్దవ్ థాకరే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ అండతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించెను. ఇక ఈ విషయాన్ని దృష్టిలో తీసుకొని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇలాంటిదే తెలంగాణలో కూడా జరగబోతుంది అని.. ఈ విషయాని కేసిఆర్ కు చెప్తున్నాను అని అన్నారు.

కేసీఆర్ పార్టీలో అసంతృప్తి ఎక్కువగా ఉంది అని.. ముఖ్యంగా తమ పదవులు ఉంటాయని నమ్మకం ఆ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని అన్నారు. ఇక వారు ఏ క్షణంలోనైనా ఆ పార్టీ నుండి బయటికి వచ్చి మరో పార్టీలో చేరే అవకాశం ఉందని అన్నారు. ఒక కేసీఆర్ నరేంద్ర మోదీని చూసి భయపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక వరద సహాయ నిధులను తమ కార్యకర్తలకు పంచడానికే అడుగుతున్నారు అని అన్నారు.