చంద్రబాబుతో స్నేహం ఏళ్లనాటి శని అనే కామెంట్లు పుట్టుకొచ్చేలా తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అయితే గత ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు చంద్రబాబు.
ఆ పొత్తు కేసీఆర్ కి వరంలా మారిందనే కామెంట్లు వినిపించాయి. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ నేతలతో కలిసి స్టేజులు ఎక్కి చేతులు ఊపిన ప్రతీ సారీ కేసీఆర్ మైకందుకునేవారు. మళ్లీ ఆంద్రోళ్ల పెత్తనం పెరిగిపోయే ప్రమాధం ఉంది అని ఒక స్టేట్ మెంట్ జనాల్లోకి వదిలారు.
ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గత ఎన్నికల్లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అప్పటివరకూ ఎంతోకొంత ఉత్సాహంగా కనిపించించిన కాంగ్రెస్ ఫలితాలు తీవ్రంగా పడిపోయాయి. అయితే కాలక్రమేణా తప్పు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు పేరెత్తలేదు.
హస్తిన లోని కాంగ్రెస్ పెద్దలు కూడా బాబు వల్ల కలిగిన డ్యామేజీని గుర్తుపెట్టుకుని… మరోమారు ఆయన ప్రస్థావన తీసుకువచ్చే సాహసం చేయలేదు.
ఈ క్రమంలో… తాజాగా మైకందుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్… తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ అని, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. దీంతో… టీడీపీలో నుంచి వచ్చిన రేవంత్ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ అనేది ఆయన ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చు!
ఈ సందర్భంగా మరింత మాట్లాడిన కేటీఆర్… విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం నిర్లక్ష్యం చేయడాన్ని రేవంత్ రెడ్డి ఏనాడూ ప్రశ్నించలేదన్న ఆయన… రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేత అని, అందుకే మోడీని ఒక్క మాట అనడం లేదని ఆరోపించారు. దీంతో… చంద్రబాబుతో ఒక్కసారి స్నేహం చేస్తే ఆ వాసనలు పోగొట్టుకున్నా పోవని అంటున్నారు పరిశీలకులు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా పరిపాలించిన పార్టీ తెలంగాణ శాఖకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చీఫ్ గా ఉన్నారు. ఆయన వైఎస్సార్ పేరును ఏ స్థాయిలో వాడుకోవాలో ఆ స్థాయిలో వాడుకోవడం లేదనే విమర్శ ఉంది. అది ఆయనకు ఆయన గురువు కి నామోషీ అనే ఫీలింగ్ ఉందో ఏమో తెలియని పరిస్థితి. దీంతో… కేటీఆర్ లాంటి వాళ్లకు రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ చంద్రబాబు మనిషిగానే కనిపిస్తున్నాడు!
ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తే మాత్రం… కచ్చితంగా అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే, మరో పక్క కాంగ్రెస్ లో రేవంత్ కెరీర్ కు కూడా ఇబ్బందే అని అంటున్నారు పరిశీలకులు. మరి ఆ మచ్చను రేవంత్ రెడ్డి ఎలా తొలగించుకుంటారనేది వేచి చూడాలి.