బామ్మర్ది కేటిఆర్ బాటలో బావ హరీష్ రావు

తండ్రి బాటలో తనయుడు నడుస్తారు. నాయకుడి బాటలో అనుచరులు నడుస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్నవాళ్లయినా సరే వారు చూపిన బాటలో పెద్ద వాళ్లు కూడా నడుస్తారు. తాజాగా తనకంటే చిన్నవాడైన తెలంగాణ మంత్రి కేటిఆర్ బాటలో నడిచారు హరీష్. అంతగా కేటిఆర్ బాటలో హరీష్ నడవడమేంది అనుకుంటున్నారా? చదవండి.

తెలంగాణ ఐటి శాఖ మంత్రిగా కేటిఆర్ పనిచేస్తున్నారు. ఐటి మంత్రి కాబట్టి పాలనలో ఐటి ని మిక్స్ చేస్తూ సాగుతున్నారు కేటిఆర్. ఆయన ట్విట్టర్ వేదికగా జనాలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ట్విట్టర్ లో ఎవరైనా తమ సమస్యలు వెల్లడిస్తే వెంటనే రియాక్ట్ అయి ఆ సమస్యలు పరిష్కరిస్తారన్న పేరుంది. అంతేకాదు రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు కూడా ట్విట్టర్ వేదికగానే చేస్తుంటారు కేటిఆర్. అందుకే కేటిఆర్ కు ట్విట్టర్ ఫాలోయర్స్ దండిగా ఉన్నారు. గూగుల్ సెర్చ్ లో కేటిఆర్ అని పేరు టైప్ చేస్తే 3 కోట్ల సంఖ్యలో సెచ్చ్ లు ఉంటాయి. 

కేటిఆర్ తో పోలిస్తే హరీష్ రావు మాస్ రాజా టైప్. ఆయన పగలు రాత్రి తేడా లేకుండా జనాల్లోనే వర్క్ చేస్తారు. ప్రాజెక్టుల వద్ద రాత్రి నిద్రలు చేస్తూ నిత్యం జనాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారు. కానీ తాజాగా ఒక విషయంలో మంత్రి హరీష్ రావు కేటిఆర్ ను ఫాలో అయ్యారు. అదేమంటే ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై హరీష్ రావు విమర్శలు కురిపించారు. ఇప్పటి వరకు రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలన్నీ హరీష్ రావు మీడియా ముఖంగానే చేసేవారు. కానీ తాజాగా రాహుల్ గాంధీపై  ట్విట్టర్ లో విమర్నలు గుప్పించారు హరీష్. 

హరీష్ ట్విట్టర్ లో రాహుల్ కు కౌంటర్ తాలూకు కామెంట్స్ కింద ఉన్నాయి చదవండి.

రాహుల్ స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలి. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో అంచనా వ్యయాన్ని 38 వేల కోట్ల నుంచి…
లక్ష కోట్లకు పెంచారని రాహుల్ కు స్క్రిప్ట్ రైటర్లు చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల తొలి జీవో 17 వేల కోట్లకు జారీ చేశారని వారు మరచిపోయారు. ఏడాది వ్యవధిలో కనీసం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకముందే 2008లో 38 వేల కోట్లకు, 2010లో 40 వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశారు. ప్రాజెక్టు వ్యయం ఆ విధంగా ఎందుకు పెంచారో రాహుల్ చెప్పగలరా? కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 80 వేల 190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించింది. లక్ష కోట్లకు కాదు. ఈ విషయం రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైటర్లకు తెలియదా?

రీ డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ను సీడబ్ల్యూసీ ఆమోదించి అన్ని అనుమతులను కేవలం ఏడాది వ్యవధిలోనే ఇచ్చింది. మన దేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ అనేది అపెక్స్ బాడీ. జలవనరుల శాఖకు ఇది అనుబంధం. ఈ విషయంపై రాహుల్ కు, ఆయన స్క్రిప్ట్ రైటర్లకు అవగాహన ఉందా? అలాంటి అత్యున్నత కమిషన్ విశ్వసనీయతను రాహుల్ ఎలా అనుమానిస్తారు?

అంబేడ్కర్ ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. అలా చెప్పి స్క్రిప్టు రైటర్లు రాహుల్ ను మళ్లీ తప్పుదోవ పట్టించారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అలాగే ఉంది. ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది.

హరీష్ రావు చేసిన ట్వీట్ లింక్ కింద ఉంది చూడండి.