ప్రగతి భవన్ పేరు వినగానే… మనకేమనిపిస్తది శత్రు దుర్భేధ్యమైన ప్రదేశం అని తెలుసు. అనుమతి లేకపోతే అక్కడికి చీమ కూడా చేరుకోలేదు. 2014 తర్వాత ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కు వాస్తుదోషం ఉందని భావించిన కేసిఆర్ కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఆధునిక హంగులతో ప్రగతి భవన్ నిర్మించారు. ప్రగతి భవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసిఆర్ పాలన మొత్తం ప్రగతి భవన్ కేంద్రంగా సాగిస్తున్నారు. అయితే సోమవారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి బుల్లెట్ (బైక్) మీద ప్రగతి భవన్ చేసుకుని కొత్త చర్చను లేవనెత్తారు.
ప్రగతి భవన్ లో పెద్ద పెద్ద స్టేచర్ ఉన్నవారికే కొన్నిసార్లు ఎంట్రీ ఉండదు. ఉపముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి ఉన్నవారు కూడా కొన్నిసార్లు ప్రగతి భవన్ లోకి అనుమతి లేకుండా వెళ్లలేకపోయినట్లు చెబుతుంటారు. ఇఖ సామాన్యులెవరూ ఆ భవన్ దరిదాపుల్లోకి కూడా చేరుకున్న పరిస్థితులు లేవు. గతంలో సిఎం లుగా పనిచేసిన సమయంలో చాలామంది ప్రజా దర్బార్ నిర్వహించేవారు. ఆ పేరుతో సిఎం ఇంట్లోకి సామాన్యులు కూడా చేరే అవకాశాలు ఉండేవి. కానీ తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రగతి భవన్ లోకి మాత్రం సామాన్యులను ఇప్పటివరకు రానివ్వలేదు.
ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి సోమవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కేసిఆర్ తో భేటీ కాబోతున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాను తెలంగాణ సిఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) లో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. రాబోయేది టిఆర్ఎస్ సర్కారే అని చెబుతూ తాము టిఆర్ఎస్ వెంట ఉంటామని ప్రకటించారు.
అందుకోసమే సామాన్య మానవుడిగా అసదుద్దీన్ ఓవైసి బుల్లెట్ మీద హెల్మెట్ పెట్టుుకుని మరీ ప్రగతిభవన్ కు వెళ్లారు. ఆయనను గుర్తు పట్టిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే లోపలికి అనుమతించారు. అసదుద్దీన్ ఒక్కడే బుల్లెట్ మీద ప్రగతి భనవ్ కు వెళ్లిపోయారు.
సాధారణంగా ఎంపీలు అన్నా, పార్టీ అధినేతలు అన్నా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు. కానీ అసదుద్దీన్ కూడా చాలా సందర్భాల్లో పెద్ద కార్లలోనే తిరుగుతారు. కానీ గన్ మెన్లను ఆయన ఎప్పుడు వెంట పెట్టుకుని తిరిగిన దాఖలాలు లేవు. ఆయతోపాటు అక్బరుద్దీన్ కూడా గన్ మెన్లు లేకుండానే సిటీ అంతా చక్కర్లు కొడుతూ ఉంటారు. కానీ గతంలో అక్బరుద్దీన్ మీద దాడి చేశారు ప్రత్యర్థులు. అప్పటి నుంచి అక్బరుద్దీన్ గన్ మెన్లను తన వెంట ఉంచుకుంటున్నట్లు చెబుతున్నారు.
అక్బరుద్దీన్ బుల్లెట్ మీద వెళ్లడం రాజకీయ , మీడియా వర్గాల్లోనే కాకుండా సామాన్య జనాల్లో కూడా చర్చనీయాంశమైంది. మరి కేసిఆర్, అసదుద్దీన్ ఏరకమైన చర్చలు ప్రగతి భనవ్ లో జరపబోతున్నారన్న ఉత్కంఠ మొదలైంది. ఒకవైపు వంద సీట్లతో అధికారంలోకి రాబోతున్నామని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్, ఆయన కొడుకు కేటిఆర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత హంగ్ రాబోతుందని కూడా విశ్లేషణలు బయటకొచ్చాయి. దీంతో హంగ్ వస్తే ఏంటి అన్న దానిపై కేసిఆర్, అసదుద్దీన్ ఓవైసి ప్రగతి భవన్ వేదికగా చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.