గ్రేటర్ ఫలితం : బోణి కొట్టిన ఎంఐఎం … అక్కడ విజయఢంఖా

ghmc

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఏడుగురు పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ విజయం సాధించింది.

trs party won the mayor seat in 2020 ghmc elections
GHMC elections 2020

అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంఐఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో పడిపోయింది. ఆది నుంచి ఎంఐఎం అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. చివరిగా ఎంఐఎం విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బోణి కొట్టింది.ఇక్కడ పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావటంతో తొలి రౌండ్‌లోనే ఫలితం తేలింది. హుస్సేన్ గతంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు.

ఇక మెట్టుగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ తొలి విజయం నమోదు చేసుకుంది. మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు.ఉదయం 8 గంటలకు కౌటింగ్ మొదలైతే, మొదటి రౌండ్ ఫలితాలు రావడానికి మధ్యాహ్నం 12 దాటింది. ఈ లెక్కన పూర్తి ఫలితాలు రావడానికి సాయంత్రం 4 అయ్యే అవకాశం ఉంది.