తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారత్ మొత్తం ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ లో పాగా వేయాలని బీజేపీ పార్టీ ఎంతో ప్రయత్నించింది. చివరకు కేంద్ర మంత్రులను కూడా హైదరాబాద్ లో దించింది. కానీ.. గ్రేటర్ ఫలితాల్లో బీజేపీ దూకుడు అంతగా లేదు. టీఆర్ఎస్ పార్టీ దూకుడు ముందు బీజేపీ వెలవెలబోయింది. గ్రేటర్ లో కారు మాత్రమే దూసుకుపోతోంది.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీ 15 డివిజన్లలో గెలుపొందింది. ఎంఐఎం 20 స్థానాలలో గెలుపొందగా… బీజేపీ 7 స్థానాల్లో గెలుపొందింది.
ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కన్నా ఎంఐఎం ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా.. టీఆర్ఎస్ పార్టీ మరో 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం మాత్రం కేవలం 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
బీజేపీ గెలిచిన స్థానాలు.. ముషీరాబాద్, అడిక్ మెట్, గచ్చిబౌలి, మోండా మార్కెట్, చైతన్యపురి, జీడిమెట్ల.