అక్టోబర్ 4 న జరిగే పంచాయితీ సెక్రటరీ పరీక్ష ను వాయిదా వేయాలని కోరుతూ వరంగల్ నగరంలో కేయు జెఎసి ఆందోళనకు దిగింది. పంచాయితీ సెక్రెటరీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హన్మకొండ లోని నయిం నగర్ నుండి పెట్రోల్ పంపు వరకు 300 మంది అభ్యర్థులు మహర్యాలీ నిర్వహించారు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కెయు జెఎసి ఛైర్మన్ దుర్గం సారయ్య మాట్లాడుతూ పంచాయతీ సెక్రెటరీ పరీక్ష రాసే విద్యార్థులకు ప్రిపరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 45 రోజుల సమయం ఇవ్వకుండా పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ నియంతలా వ్యవహిరిస్తున్నాడని మండిపడ్డారు. అదేవిధంగా కొత్తగా మైనస్ మార్కుల నిబంధనను తీసుకురావడం లో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేవలం రాజాకీయ లబ్ది కోసమే ఇటువంటి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
మరో పక్క లక్ష ఉద్యోగాల జాతర అన్నటువంటి కేసీఆర్ తన నాలుగేళ్ళ పరిపాలనలో 16000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ తతంగాన్నంత ఉద్యమకారులు నిరుద్యోగులు మేధావులు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇప్పటికైనా తన వ్యవహారశైలి ని మార్చుకుని వెంటనే మైనస్ మార్కుల నిబంధనను తీసివేసి పరీక్ష తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తన గడీ అయినటువంటి ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ కు పంపించి టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెఎసి కన్వీనర్ నవీద్, ఇంచార్జ్ నాగార్జున, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ సందీప్ వేణురాజ్ సాగర్ లక్ష్మణ్ శ్రీనివాస్ ప్రవీణ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.