కెటియార్ చీఫ్ మినిష్టర్ @2019

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ అధిక్యత దిశగా పయనిస్తూ ఉండటంతో  ముఖ్యమంత్రి కెసియార్ తనయుడు, రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు మీద ఆసక్తి కరమయిన చర్చ మొదలయింది.

  కెసియార్ తిరుగులేని శక్తి తా తిరిగి రావడంతో కెటియారే తెలంగాణ ముఖ్యమంత్రి అనే చర్చ మొదలయింది. కెసియార్  కుమారుడిని ముఖ్యమంత్రిచేసేందుకు జనామోదం లభించినట్లే అయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

 ఇపుడు కెటియార్ ను ముఖ్యమంత్రి చేసినా వ్యతిరేకించడం కాదు కదా, మనసులో గొణుగడం కూడా చేయలేరెవరు. 2018 ఎన్నికల విజయం గొప్పతనం అది.

కెటియార్  ముఖ్యమంత్రి అవుతాడని  ‘తెలుగు రాజ్యం’ సంప్రదించిన టిఆర్ ఎస్  అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే,ఎపుడు అన్నదే ప్రశ్న.

 మొదట ముఖ్యమంత్రిగా కెసియారే ఉంటారని,  లోక్ సభ ఎన్నిలక దాకా ఈ ఏర్పాటు ఉంటుందని, లోక్సభ ఎన్నికల తర్వాత  ఆయన కెటియార్ ను ముఖ్యమంత్రి చేస్తారని  వారు భావిస్తున్నారు. 

కెాటియార్ ను ముఖ్యమంత్రి చేసి ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళతారని చాాలమంది టిఆర్ ఎస్ అభిమానులు వాదిస్తున్నారు.  కేంద్రానికి కెసియార్  ఏ రూపంలో వెళతారు? కేంద్రమంత్రిగానా లేక  మరొక రూపంలో నా అనే ప్రశ్నకు చాలా మంది స్పష్టంగా సమాధానం చెప్పలేదు.

అయితే, కెసియార్ కు బాగా విధేయుడయిన ఒక టీచర్  మాత్రం కెసియార్ రాష్ట్రపతి అవుతారని ఆశించారు.

‘ఇపుడు కెసియార్ ఫెడరల్ ఫ్రంటు నుముందుకు తీసుకువస్తారు. ఆయన అన్ని రాష్టాలు తిరుగుతారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా  ప్రాంతీయ పార్టీలను కూడగడతారు. దీనికి ప్రతిఫలంగా  మోదీ ఆయనకు రాష్ట్రపతి పదవి ఆఫర్ చేస్తారు, చూడండి  ఇది జరుగుతుంది,’అని  ఆయన  చెప్పారు.

(ఫోటో ట్విట్టర్ ఫ్రొఫైల్  పిక్చర్ )