తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి తీసేశారు మంత్రి కేటిఆర్. ఉత్తమ్ ను లెక్క చేయనట్లు మాట్లాడారు. నిజామాబాద్ లో కేటిఆర్ మీడియా రిపోర్టర్లతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటిఆర్ ఏమన్నారో కింద చదవండి.
ఉత్తమ్ ఉత్త సొల్లు మాట్లాడుతున్నారు. ఆయనో అధ్యక్షుడు, అదొక పార్టీ. మాట్లాడిన దానికి కొంచెమైనా ఆధారాలుండాలి. నేను కూడా అంటాను రాహుల్ గాంధీ ప్రపంచంలో అత్యంత సంపన్నుడు. అక్రమంగా సంపాదించాడు అని నేనంటాను. అదానీ, అంబానీ లాంటి వాళ్ల మాటలేమిటి ? జైలుకి పంపాల్సింది కోర్టులు తప్ప ఉత్తమ్ కుమారో,కోదండరామో కాదు. కాంగ్రెస్ ది బెయిల్ గాడి అని మోడీ అన్నది కరెక్టే. సోనియా, రాహుల్ బెయిల్ మీద ఉన్నారు. కాళేశ్వరం తో ప్రజలకు నీళ్లు కాంగ్రెస్ కు కన్నీళ్లే మిగులుతాయి. పంటలకు నీళ్లు …కాంగ్రెస్ నేతల కాళ్ల కింద కు నీళ్లు తప్పవ్. ఉత్తమ్ 75 సీట్లు వస్తాయంటున్నారు. ఆయన ఉద్దేశం దేశం మొత్తం మీద కాంగ్రెస్ సాధించే పార్లమెంటు సీట్లు కావచ్చు. కాంగ్రెస్ ఏ రాష్ట్రం లో నైనా సొంతగా 20 సీట్లు గెలిచే పరిస్థితి ఉందా ? కాంగ్రెస్ వాళ్ళ సొంత పేపర్ నేషనల్ హెరాల్డ్ లో రాఫెల్ ను ఇంకో బోఫార్స్ అని రాశారు. అక్కడే తెలుస్తుంది వారి తెలివి.
తెలంగాణ లో నివసించే వారంతా తెలంగాణ వాళ్ళు అని అంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు సెటిలర్లని విడదీస్తున్నారు. ఆంధ్రా సోదరులు ఆలోచించాలి. కేంద్రం తో ప్రజాస్వామ్య బద్ధంగా విభజన హామీల గురించి పోరాడుతున్నాం. కేంద్రం తో ముష్టి యుద్ధాలు చేయలేం కదా? కేంద్రంలో శాసించే పాత్ర ఇవ్వాలని ప్రజలను కోరుతాం. ఎన్నికల వాతావరణం వచ్చేసింది ఎపుడూ ఎన్నికలు వచ్చినా అవి ముందస్తు ఎన్నికలు కావు. కాంగ్రెస్ నేతలు బాత్రూమ్ కి వెళ్లాలన్న రాహుల్ అనుమతి తీసుకోవాలి. కాంట్రాక్టర్లను కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
స్పెషల్ ఆఫీసర్ల పాలన మాకు ఇష్టం ఉండి తెచ్చింది కాదు. సర్పంచ్ లు అర్ధం చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కాదు శబ్ద విప్లవమే ఉంటుంది.కాంగ్రెస్ గూబ గుయ్యిమంటుంది. కాంగ్రెస్, టీడీపీ లు కలవనిదెప్పుడు ? ప్రజలు తెలివయిన వాళ్ళు. పార్టీ ల డ్రామాలు వారు గ్రహిస్తారు. మేము టికెట్ లు ఇస్తామంటే ఉత్తమ్, జానా లు మినహా అందరూ టిఆర్ఎస్ లో చేరే పరిస్థితి ఉంది. కొందరు చేరతామంటున్నా మేము వద్దంటున్నాం. ఫెడరల్ ఫ్రంట్ ఆగిందని ఎందుకనుకుంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ తప్పనిసరిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం.