KTR: రేవంత్ డబ్బుల సంచులతో దొరికిన దొంగ… అది నిరూపిస్తే ఫామ్ హౌస్ రాసిస్తా: కేటీఆర్

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది అయితే ఈ ఏడాది కాలంలో బిఆర్ఎస్ పార్టీకి ఎన్నో ఇబ్బందులు కలిగించారని తెలిపారు..

ఏడాది కాలంలో కెసిఆర్ అనారోగ్యానికి గురికావడం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం కవిత జైలుకు వెళ్లడం వంటి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని మేము నిలబడ్డామని తెలిపారు. మరో నాలుగు సంవత్సరాల పాటు ఇలాగే బిఆర్ఎస్ నాయకులు కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అన్ని విషయాలలో కూడా పూర్తిగా వెనుకబడిపోయి ఉన్నాము. ఎవరికైనా మంచి జరిగింది అంటే అది ఎనుముల బ్రదర్స్ కి మాత్రమేనని తెలిపారు.

ఎనుముల బ్రదర్స్ నేడు ఏ స్థాయిలో ఉన్నారు అంటే తెలంగాణలో 1000 కోట్లు పెట్టుబడే స్థాయికి వారు ఎదిగారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో మాట్లాడుతూ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడం సిగ్గుచేటు అని తెలిపారు. ఇక కెసిఆర్ ఉద్యోగాలను ఇస్తే వాటన్నింటిని తన ఖాతాలో వేసుకుంటున్నారని తెలిపారు.రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ఆయనకు విలువలు లేవని డబ్బులు సంచులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.

సీఎంతో పాటు మంత్రులకు కూడా అవగాహన లేదని విమర్శించారు. 2023లో రెవెన్యూ మిగులు రూ.5944 కోట్లుగా ఉందని చెప్పారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందని తరచూ మాట్లాడే రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో ఆధారాలతో సహా నిరూపిస్తే ఆ ఫామ్ హౌస్ తనకే రాసిస్తాను అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.