KTR: తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ కబంధ హస్తాలలో చిక్కుకుందని తెలిపారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఈ కబంధ హస్తాల నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా మరో సంకల్ప దీక్ష చేపట్టాలని ఈయన తెలిపారు. నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్ చెరిగిపోని సంతకం చేశారు.2009 నవంబర్ 29న దీక్ష ప్రారంభించారని ఈయన గుర్తు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదం దేశ రాజకీయాలని కదిలించింది. ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. కేసీఆర్ స్ఫూర్తితో మళ్ళీ కేంద్ర పార్టీల మెడలు పెంచాల్సిన సమయం దగ్గర పడిందని కేటీఆర్ తెలిపారు.
స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. 33 జిల్లా కేంద్రాల్లో, పార్టీ కార్యాలయాల్లో నవంబరు 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ తెలిపారు.నవంబర్ 26న సన్నాహక సమావేశాలు ఉంటాయి. 29న నిమ్స్‌లో అన్నదానం చేస్తాం. డిసెంబర్ 9న మేడ్చల్‌లో ఘనంగా తెలంగాణ తల్లికి ప్రణమిళ్లుతాం. అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమాలలో కేసీఆర్ పాల్గొనడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము కేసీఆర్ కి కృతజ్ఞతలు చెప్పుకునే కార్యక్రమాలు అంటూ కేటీఆర్ తెలిపారు.
ఈ విధంగా కేటీఆర్ మరో సంకల్ప దీక్షకు పిలుపునిస్తూ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి. మరి దీక్ష గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు ఏ విధంగా స్పందిస్తారు వారి అభిప్రాయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.