KTR: రాజకీయాలకు కేటీఆర్ బ్రేక్… ఈ విరామం వెనక అంత పెద్ద వ్యూహం ఉందా?

KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల రాజకీయాలకు చిన్న విరామం ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ట్వీట్ చేసిన రాజకీయ ప్రత్యర్థులు ఎవరు తనని మర్చిపోరు అంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ విధంగా కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కేటీఆర్ రాజకీయ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఒకవైపు పార్టీ కోసం ప్రచార కార్యక్రమాలు అన్నింటిని నిర్వహిస్తూనే బిజీగా గడిపారు అయితే తమ పార్టీ ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా కూడా ఈయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాజకీయ పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఇటీవల ఈయన తనకు కొంత విరామం కావాలని రాజకీయాల పరంగా తనకు రీప్రెషన్ అవసరమని అందుకే రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ఇలా రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇవ్వడం వెనక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తుంది. ఇక ఈయన నవంబర్ 29వ తేదీ దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరిగా ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ 15 సంవత్సరాల క్రితం ఇదే రోజున పోరాటం చేశారంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకొని ఈయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి ఊహించిన దాని కంటే కూడా ఎక్కువగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావడంతో కేటీఆర్ కు పార్టీ పట్ల మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనవరి రెండు లేదా మూడోవారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలల్లో పార్టీ కార్యక్రమాలు బలంగా చేపట్టి.. నిత్యం ప్రజలలో ఉంటే తమ పార్టీ శ్రేణులను గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.

ఇలా జనవరి నుంచి నిత్యం ప్రజలలో ఉంటూ మరిన్ని కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందువల్లే ప్రస్తుతం రాజకీయాల నుంచి చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత వరుస కార్యక్రమాలతో బిజీ కానున్నారని తెలుస్తోంది.