KTR: ఇది కక్ష్యా? ఇది శిక్ష్యా?లేక నిర్లక్ష్యమా… రేవంత్ తీరుపై ఫైర్ అయిన కేటీఆర్?

KTR: గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ సమక్షంలో గురుకులాలు ఎవరెస్ట్ స్థాయికి చేరుకున్నాయి గురుకులాలలో చదివే విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు అయితే ఈ పది సంవత్సరాల కాలంలో ఎవరెస్టు శిఖరానికి చేరుకున్న గురుకులాల స్థితిని ఈ ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి పాతాళానికి పడేశారు అంటూ కేటీఆర్ గురుకులాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ? ఇది కక్ష్యా? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా ? అని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అందుకే విద్యార్థిలతో పాటు వారి తల్లితండ్రులను కూడా భయాందోళనలకు గురి చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురుకుల పాఠశాలలలో ఉంటూ కలుషిత ఆహారం తీసుకొని సుమారు 50 మందికి పైగా పిల్లలు చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం ఆ విద్యార్థుల గురించి ఏమాత్రం స్పందించడం లేదు అలాగే గురుకులాలపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా? అంటూ ప్రశ్నించారు.

గత పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ గురుకులాలకు ఆదర్శం… నేడు మాత్రం అంతులేని నిర్లక్ష్యం. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరు ? అని కేటీఆర్ రేవంత్ తీరును ప్రశ్నిస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.