KTR: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మార్పులపై ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలను ఇచ్చే అధికారంలోకి వచ్చారని తెలిపారు ముఖ్యంగా రైతు రుణమాఫీ ప్రకటించడంతో ప్రజలందరూ తమ తలరాతలు మారాలని ఓట్లు వేసి అధికారం ఇచ్చారని తెలిపారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క గ్రామంలో అయినా కూడా 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే కనుక నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఏ గ్రామంలోనూ కాదు మీ సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో 100% రుణమాఫీ చేసినట్టు కనక నిరూపిస్తే నేను రాజకీయాలకు దూరం అవుతానని తెలిపారు.
ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తమ తలరాతలు మార్చమని కానీ తల్లిని మార్చమని కాదు అంటూ ఈయన మరోసారి తెలంగాణ తల్లి మార్పుపై సెటైర్లు వేశారు. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికే ఉంది.. బహుజన తల్లి బంగారం వేసుకోకూడదా? అని నిలదీశారు. మీరు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం తెలంగాణ తల్లిది కాదు కాంగ్రెస్ తల్లిది అంటూ సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్న పార్టీ మారితే తల్లి మారుతుందా? అని మండిపడ్డారు.
వీళ్లు ఏం చేసినా మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది.. మూడేళ్ల తర్వాత రాహుల్ తండ్రిని, కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్‌కు పంపిస్తాం అని స్పష్టం చేశారు. బతుకమ్మ తీసేసి చెయ్యి పెట్టారు.. మేం పేదల బతుకులు మార్చే పనిచేశాం.. పేర్లు మార్చే పనిచేయలేదు.. అలా చేసుంటే రాజీవ్, ఇందిరా గాంధీ పేర్లతో ఒక్క సంస్థ ఉండేది కాదు కదా అంటూ ఈయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.