KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్తో కౌంటర్ ఇచ్చింది. ఇలా బిఆర్ఎస్ నేతలు అలాగే కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాటలు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉంటారు.
ఇకపోతే ఇటీవల కేటీఆర్ దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం గురించి ఈయన మాట్లాడారు.తెలంగాణ ఉద్యమంలో సరిగ్గా 15 ఏళ్ళ క్రితం తనను అరెస్టు చేసి వరంగల్ సెంటర్ల్ జైలులో ఉంచారని, జైలుకెళ్లిన ఆ రోజు జైలు జీవితాన్ని గుర్తు చేసే ఆ బ్యాడ్జీ జీవితాతం నాకు ఆరాధనీయమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ గురించి తాజాగా కాంగ్రెస్ స్పందిస్తూ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చింది. 15 సంవత్సరాల క్రితం నిన్ను అరెస్టు చేసే వరంగల్ జైలులో పెట్టారు. వందేళ్లు చరిత్ర కలిగిన జైలును కూలగొట్టావు నీ పాపం ఊరికే పోదు కేటీఆర్.అధికారంలో ఉండగా మదంతో కళ్ళు నెత్తి కెక్కిన నీకు.. ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎవరు కనపడలేదని అధికారం పోగానే అందరి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న నీ తీరు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు.
నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసిన పాపాలకు శిక్షపడే రోజు త్వరలోనే రాబోతోంది. మళ్లీ నువ్వు జైలుకు పోవడం గ్యారంటీ నువ్వు చేసిన పాపాలకు తెలంగాణలో ఏ జైలు కూడా నీకు సరిపోదు. నీకు అండమాన్ జైలు అయితేనే సరిపోతుంది అంటూ కాంగ్రెస్ కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇలా ఈ రెండు పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు నిత్యం విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.