KTR: ప్రతిపక్ష పార్టీగా ఏడాది పూర్తి.. సంచలనమైన పోస్ట్ చేసిన కేటీఆర్!

KTR: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది అలాగే ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఏడాది కాలం పాటు తమ పార్టీ కోసం నిలబడిన నాయకుల గురించి అలాగే ఈ ఏడాదిలో తమ పార్టీ ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..ఇది మీరు ఎంత గట్టిగా కొట్టగలరనే దాని గురించి కాదు.. ఎంత కష్టపడి సాధించగలరు అని దాని గురించి అంటూ పోస్ట్ చేశారు. ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని తెలిపారు. గత ఏడాది మన పార్టీకి ఎన్నో సవాళ్లను ఎదిరించింది ఎన్నో ఒడిదుడుకులతో కష్టతరమైన ఏడాదిగా మిగిలిపోయింది. ఇలా ఏడాది అయినా మేము ఇక్కడ పోరాడుతున్నాము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నామనేది నిరూపించాము.

దీనికై ధైర్యంగా నిలిచిన మా అధ్యక్షుడు కేసీఆర్‌ నాయకత్వానికి, మా నాయకులకు, అట్టడుగు వర్గాల సైనికులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. ఇక ఈ పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా యోధులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఈ ఏడాది కాలంలో తమ పార్టీ పార్టీ నాయకులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనే విషయాలను తెలియచేయడమే కాకుండా తమ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు ఎలా అండగా నిలిచారనే విషయాలను తెలియచేశారు.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది అంటూ తరచూ ఈయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఏడాది ప్రతిపక్ష నేతగా ఎదుర్కొన్న సవాళ్లను కూడా కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.