తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే.. !

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాట్లాడుతూ వరదల్లో విదేశీ హస్తం ఉందని కేసీఆర్ మాట్లాడటం బాధాకరం అని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ప్రకారం 70 నుంచి 78 శాతం వ్యతిరేకత ఉందని తేలిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

క్లౌడ్ బరస్ట్, పారాసిటమాల్ లాంటి లూజ్ మాటలు కేటీఆర్ మాట్లాడరని అయితే గ్రామీణ ప్రాంతాలలో, ఎమ్మెల్యేలలో కేటీఆర్ కు ఆదరణ లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాతే నాకు రాజకీయాలు అర్థమవుతున్నాయని ఆయన కామెంట్లు చేశారు. టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

యాంటీ కేసీఆర్‌ సెంటిమెంట్ వల్ల కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన కామెంట్లు చేశారు. ఆంధ్రాలో బంధువులు, స్నేహితులు ఉన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ నన్ను బాగా గౌరవించారని అయితే నన్ను ముందు పెట్టుకొని తెలంగాణకు ద్రోహం చేశారని ఆయన కామెంట్లు చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని ఒక్క ఎకరాకు కూడా కేసీఆర్ చుక్కనీరు అందించలేదని ఆయన చెప్పుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్ట్ ల డిజైన్లలో తప్పులు జరిగాయని ఆయన తెలిపారు. నేను కొట్లాడిన తెలంగాణకు ద్రోహం జరగడంతో ఆ పార్టీకి నేను దూరంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీని చాలామంది అపార్థం చేసుకుంటున్నారని హిందూ అనేదే అతిపెద్ద సెక్యులర్ సిద్ధాంతం అని ఆయన కామెంట్లు చేశారు.