సీఎం కేసీఆర్ పై కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ ఆమె కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణను మొత్తం అవినీతిమయం చేశారని విమర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి కేటిఆర్ కు కమీషన్లు వస్తాయన్నారు. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని దుయ్యబట్టారు. డ్రగ్స్, నయీం కేసులు ఏమయ్యాయయని ప్రశ్నించారు.
మహిళా బీసీ నేతగా తన పుట్టిన రోజు నాడు సీఎం అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదని విమర్శించారు. మహిళా మంత్రి కేబినేట్ లో లేని ఘనత కేసీఆర్ దే అన్నారు. తెలంగాణలో బార్లకు విచ్చల విడిగా అనుమతులు జారీ చేశారు. దానితో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతున్నాయన్నారు. కేటిఆర్ కు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు అందుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ క్యాంపు ఆఫీసు, ఫాం హౌజ్ లకే పరిమితమైందన్నారు. తెలంగాణ లో అభివృద్ది కుంటుపడిందన్నారు.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని సోనియా దయతో తెలంగాణ వచ్చిందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ను బంగారం లాంటి మనిషని నేడు దద్దమ్మ, సన్నాసి అని తిడుతుర్రు. ఇది తగునా అని సురేఖ ప్రశ్నించారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించని అసమర్ధ ప్రభుత్వమన్నారు. మందు గోలీలు ఇచ్చే సంతోష్ ను రాజ్యసభకు పంపారని, లష్కర్ బోనాలకు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవితకు అర్హతేంటని విమర్శించారు. జోగిని శ్యామలకు బోనమెత్తుకునే అర్హత లేదా అని ప్రశ్నించారు. శ్యామల శాపం పెట్టినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కేటిఆర్ రాజకీయ సన్యాసానికి సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు. పార్టీలో ఉన్నంత వరకు హరిషన్న మనుషులుగా ఉన్నామని హరిషన్నకు కూడా పొమ్మనలేక పొగ బెడుతున్నారని సురేఖ ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మశాంతించాలంటే టిఆర్ ఎస్ ను ఓడించాలన్నారు. తమ కూతురు ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఉద్యమ కారులకు పదవులు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని ఆమె విమర్శించారు. ఎక్కడ చూసినా మొత్తం అవినీతి మయం చేశారని అన్నారు. బిజెపితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని ముందస్తు ఎన్నికలకు పోతున్నారని మహాకూటమి కలిసి పోటి చేస్తే తప్పేంటో కేటిఆర్ చెప్పాలని నిలదీశారు. కేటిఆర్ ఎవరెవరీ దగ్గర ఎంత తీసుకుంటున్నాడో అందరికి తెలుసన్నారు. కవితకు అమెరికా నుంచి వచ్చినప్పుడు కొంతమంది కారు అరెంజ్ చేశారు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. టిఆర్ ఎస్ లో కుటుంబ పాలన నడుస్తుందని సురేఖ తీవ్రంగా విమర్శించారు.