ఆ పార్టీలో చేరితే గద్దరే తెలంగాణ సిఎం అభ్యర్థి

ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన ఉద్యమకారుడు గద్దర్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. తమ పార్టీలో చేరితే ఏకంగా సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని ఒక సంచలన పార్టీ ఆఫర్ పెట్టింది. మరి గద్దర్ ఆ పార్టీలో చేరుతారా? లేదా అన్నది ఇంకా తేలలేదు.  ఇంతకూ గద్దర్ కు బంపర్ ఆఫర్ పెట్టిన పార్టీ ఏది? వివరాలేంటి? చదవండి.

ఢిల్లీ నుండి ఆమ్ ఆద్మీ పార్టి ప్రతినిధులు ప్రియాంక కక్కర్, రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు రాము గౌడ్ హైదరాబాద్ వచ్చి గద్దర్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై వారు గద్దర్ తో చర్చించారు. ఢిల్లీ ప్రభుత్వము అమలు చేస్తున్న విద్య, వైద్య, విద్యుత్తు, మంచినీటి సరఫరా, పేదలకు ఇండ్లు, రైతు సంక్షేమ పథకాల గురించి గద్దర్ వివరాలు అడిగి వివరాలు తెలుసున్నారు. ఈ సందర్భముగా గద్దర్ వారితో మాట్లాడుతూ  ఆమ్ ఆద్మి ప్రభుత్వ విధానాలు ఆమలు తీరుపై హర్షం వెలిబుచ్చారు. అగస్టు 16న ఎవి కాలేజ్ లొ జరిగే సామాన్యుల సమర భేరి కి హాజరౌతానని గద్దర్ వారికి హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లొకి వెళ్ళెందుకు ఒక మంచి పాట రాస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీకి వెళ్ళి సిఎం అరవింద్ కేజ్రివాల్ ను కలువాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు గద్దర్.

గద్దర సుదీర్ఘ కాలం పాటు పుపుల్స్ వార్ సానుభూతిపరుడిగా పనిచేశారు. ఆయన రాసిన విప్లవ పాటలు ఇప్పటికీ పలెల జనాల నోటిగుండా వినబడుతుంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత గద్దర్ కంప్లీట్ గా విప్లవ రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజాస్వామయ్య పంథాలో తన ప్రయాణం సాగించేందుకు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా పావులు కదిపారు. కానీ ఏమైందో ఏమో ఇంకా రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా చేసిన కసరత్తు ముందుకు సాగలేదు. ప్రస్తుతం సిపిఎం నాయకత్వంలో సాగుతున్న బిఎల్ఎఫ్ (భహుజన లెఫ్ట్ ఫ్రంట్) కు అనుబంధంగా ప్రస్తుతం గద్దర్ పనిచేస్తున్నారు. అయితే ఆయన కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గద్దర్ మాత్రం ఇంకా ఒక నిర్ణయం మాత్రం తీసుకోలేదు. రానున్న ఎన్నికల్లో ఓటు వేయడంతోపాటు పోటీ కూడా చేసేందుకు గద్దర్ ఓటు హక్కు కోసం ఇటీవల కాలంలో దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆయనను పెద్దపల్లి ఎంపి సీటులో బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. బిఎల్ఎఫ్ తరుపున ఆయనను పోటీకి దింపుతామని ఇప్పటికే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

ఈ పరిస్థితుల్లో గద్దర్ ఓటు వేయడంతోపాటు పోటీ చేయడం ఖాయమైంది. కాబట్టి ఆయన పోటీ విషయం పక్కన పెడితే ఏ పార్టీ తరుపున అన్నది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతున్నది. అయితే తాజాగా ఆప్ పార్టీ నేతలు గద్దర్ కు సిఎం క్యాండిడెట్ మీరే అంటూ ఆఫర్ చేశారు. వారి ఆఫర్ పై గద్దర్ ఎలా స్పందిస్తారు. అన్నది తేలాల్సి ఉంది.