ఢిల్లీ కేసీయార్ బీఆర్ఎస్ ఫ్లాప్ షో.!

ఢిల్లీలో ఆర్భాటంగా భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ప్రారంభించారు. ఏవో చిన్నపాటి యజ్ఞాలు కూడా జరిగాయట.! ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ తదితరులు ఢిల్లీలో కేసీయార్‌ని కలిశారు.

అంతా బాగానే వుందిగానీ, భారత్ రాష్ట్ర సమితికి జాతీయ స్థాయిలో ఎందుకు హైప్ రావడంలేదు.? కేసీయార్‌ని ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థాయి జాతీయ నేతలు ఎందుకు కలవలేకపోయారు.?

మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామందితో కేసీయార్ గతంలో జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించారు. జాతీయ పార్టీ దిశగా వారితో చర్చలు జరిపి, చివరకు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చేశారు.

అంతెందుకు, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా కేసీయార్, జాతీయ రాజకీయాలకు సంబంధించి సంప్రదింపులు జరిపారు.. అదీ తన కుమారుడు కేటీయార్ మధ్యవర్తిత్వంతో. ఆ వైసీపీ కూడా భారత్ రాష్ట్ర సమితిని లైట్ తీసుకుంది.

జాతీయ స్థాయిలో గులాబీ పార్టీ కథ ఇంతేనా.? అన్న చర్చ మీడియాలో జరుగుతోంది. నేషనల్ మీడియా ఎటూ లెక్క చేయలేదు, తెలుగు మీడియా కూడా సెటైర్లు వేస్తోంది కేసీయార్ భారత్ రాష్ట్ర సమితి మీద. ఎందుకీ దుస్థితి.?

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా, గెలవడం కోసం పడ్డ కష్టం.. తెలంగాణలో కేసీయార్ ఇమేజ్ ఏ స్థాయికి పడిపోయిందో చెప్పకనే చెప్పిందన్నది మెజార్టీ అభిప్రాయం. తెలంగాణలో సీన్ సితార్ అయిపోయింది గనుక, ఢిల్లీ రాజకీయాల పేరుతో కొత్త హంగామా.. అన్న భావన అందరిలోనూ కలుగుతోంది.