తెలంగాణలో కేసీఆర్ చేసిందే చట్టం, చెప్పిందే మాట అనే పద్ధతికి కాలం చెల్లిందా…అంటే అవుననే అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు… తారాజువ్వలా ఒక్కసారిగా బీజేపీ పార్టీ తెలంగాణ లో బలపడి దుబ్బాకలో టీఆర్ఎస్ ని ఓడించింది. అంతేనా గ్రేటర్ లో కూడా గెలుపు ధీమాతో ముందుకు వెళుతుంది.ఈ క్రమంలో ఇక్కడ కేసీఆర్ ఓడిపోతే మాత్రం అయన రాజకీయ జీవితం, పార్టీ రాజకీయ భవిష్యత్ కొంత రిస్క్ లో ఉన్నట్లే అని చెప్పాలి. ఎందుకంటే ఓ నేషనల్ పార్టీ ఇక్కడ బలం చేజిక్కుంచుకుంటే అది తగ్గిపోవడం ఇప్పట్లో జరిగే పని కాదు.
మార్పు కోసం ప్రజలలో వచ్చిన చైతన్యం అంత తొందరగా పోదు. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. తూటాల్లాంటి మాటలు.. వెనుకా ముందు చూసుకోకుండా రాజకీయ ప్రత్యర్థిని ఎంత మాట అయినా అనేందుకు ఏ మాత్రం మొహమాటపడని నేతగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవతరించారు.. ఇదే సాకుగా ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ ని దారుణ విమర్శలు చేస్తున్నారు. ఒక్క దుబ్బాక విజయం తోనే బండి ఇంత విమర్శలు చేస్తుంటే గ్రేటర్ లో ఓడిపోతే ఇంకేమైనా ఉందా..గ్రేటర్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకు బర్ బాద్ కావటం ఖాయమన్నారు.
రాష్ట్రంలో అధికారంలో లేకుండా రెండు అసెంబ్లీ సీట్లతో బీజేపీ ఈరేంజ్ లో రెచ్చిపోతుంటే రేపు నగరం లో మేయర్ సీటు లభిస్తే బీజేపీ అరాచకం మొదలవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే మైనార్టీలను టార్గెట్ చేస్తూ పాతబస్తీ సర్జికల్ స్ట్రైక్ అని అనౌన్స్ చేసి ఈ ఎన్నికలను వివాదంలోకి లాగింది. ఇప్పుడు కేసీఆర్ ని విమర్శలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ కి భవిష్యత్ లేకుండా చేసే విధంగా చేయాలనీ చూస్తుంది. మరి కేసీఆర్ వీరి విమర్శలకు ధీటుగా నిలబడి ఈ ఎన్నికల్లో గెలిచి వారికి బుద్ధి చెపుతాడా చూడాలి.