పోలింగ్ కు ముందే భయపడుతున్న కేసీఆర్.. ఆ గుబులు మొదలైందిగా?

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు నియోజకవర్గంలో జరగనున్న ఉపఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించినా మెజారిటీ స్వల్పంగానే ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రధాన పార్టీలకు స్వతంత్రుల గుర్తులు సమస్యగా మారాయి. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కారును పోలిన గుర్తును పెట్టుకుంటే మరి కొందరు పువ్వును పోలిన గుర్తును పెట్టుకున్నారు. బీజేపీ, టీ.ఆర్.ఎస్ లకు నష్టం కలిగించేలా కొందరు స్వతంత్ర అభ్యర్థులు అడుగులు వేశారు.

అయితే ఈ గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతారని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్ నుంచి తప్పుకునేలా చేయడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే టీ.ఆర్.ఎస్ పార్టీ ఈ గుర్తుల విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత ఓటముల నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

బీజేపీ మాత్రం స్వతంత్ర అభ్యర్థులకు భారీ మొత్తం ఆఫర్ చేసి ఆ అభ్యర్థులు నామినేషన్ ను ఉపసంహరించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తూ అందరికీ షాకిస్తున్నాయి. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి డిపాజిట్ కేవలం 10,000 రూపాయలు కావడంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ వేశారు.

83 మంది నామినేషన్లను దాఖలు చేయగా వీరిలో ఎంతమంది పోటీలో ఉంటారో చూడాల్సి ఉంది. మునుగోడు ఉపఎన్నిక కోసం పార్టీలు రాష్ట్ర ఎన్నికల స్థాయిలో ఖర్చు చేస్తున్నాయి. ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా ఆ అభ్యర్థికి ఆర్థికంగా కలిగే నష్టం ఊహించని రేంజ్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గుర్తుల వల్ల పోలింగ్ కు ముందే కేసీఆర్ భయపడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.