ఏపీ రాజకీయాల్లోకి టీ.ఆర్.ఎస్.. జగన్ సపోర్ట్ చేయకపోతే కేసీఆర్ నిర్ణయమిదే!

YCP Running

రాజకీయాలపై అవగాహన ఉన్నవాళ్లలో చాలామంది జగన్ కేసీఆర్ మధ్య స్నేహం ఉందని భావిస్తారు. ఆ స్నేహం వల్లే తెలంగాణలో పోటీ చేయడానికి వైసీపీ దూరంగా ఉంటే ఏపీలో పోటీ చేయడానికి టీ.ఆర్.ఎస్ దూరంగా ఉంది. తెలంగాణలో షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ పెట్టినా ఆ పార్టీ వల్ల అటు జగన్ కు కానీ ఇటు కేసీఆర్ కు కానీ పెద్దగా నష్టం ఉండదనే సంగతి అందరికీ తెలుసు. అయితే కాలంతో పాటే పరిస్థితులు కూడా మారతాయి.

ఏపీ రాజకీయాల్లోకి టీ.ఆర్.ఎస్ పార్టీ ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ మొదట ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ఇవ్వని పక్షంలో కేసీఆర్ నిర్ణయం ఇదేనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ జాతీయ పార్టీకి జగన్ మద్దతు ఇస్తే బీజేపీ నుంచి వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అయితే జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. తెలంగాణ సరిహద్దులో ఉండే ఏపీ జిల్లాలలో పోటీపై కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. మొదట ఆ జిల్లాల నుంచి టీ.ఆర్.ఎస్ పార్టీ పోటీ చేయనుందని తెలుస్తోంది. జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలనే ఉద్దేశంతో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఏపీలో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఇతర ప్రాంతాలలో టీ.ఆర్.ఎస్ పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది. టీ.ఆర్.ఎస్ ఏపీలో పోటీ చేయడం వల్ల ఈ పార్టీకి పెద్దగా లాభం లేకపోయినా పోటీ వల్ల వైసీపీ ఓట్లు కొంతమేర చీలే అవకాశం ఉంది. కేసీఆర్ పై ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఏపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఒక విధంగా కేసీఆర్ కారణమని ఇప్పటికీ చాలామంది భావిస్తారు.