ఆ రైతులకు కేసీఆర్ చెల్లని చెక్కులు ఇచ్చారా.. అయ్యో పాపం అంటూ?

రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకునే దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేసి ఆ రైతులకు చెక్కులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చెక్కులు చెల్లని చెక్కులు అంటూ కామెంట్లు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. పంజాబ్ రైతులు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లవని చెబుతూ సమాచారం ఇవ్వగా కేసీఅర్ సర్కార్ ఇలా చేస్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించిన కేసీఆర్ సర్కార్ విమర్శల గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. బ్యాంకు నిబంధనల మేరకు చెక్కులను మంజూరు చేసిన మూడు నెలల్లో బ్యాంకులలో డిపాజిట్ చేయాలని అలా డిపాజిట్ చేయని చెక్కులు క్లియర్ కావని తెలిపారు. అయితే ఈ చెల్లని చెక్కులకు సంబంధించి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టతనిచ్చారు.

ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ రామ్ సింగ్ ను కలవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటం వాస్తవమే అని అయితే చెల్లని చెక్కులు ఇచ్చేంత దీనస్థితిలో లేదని అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ వేగంగా స్పందించడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే మంచిది.

3 నెలల్లోపు బ్యాంకులో చెక్కులను డిపాజిట్ చేసిన రైతులకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. ఆలస్యంగా బ్యాంకులో చెక్కులను డిపాజిట్ చేసిన వాళ్లకు మాత్రమే ఈ తరహా సమస్య ఎదురైంది. కేసీఆర్ సర్కార్ క్లారిటీ నేపథ్యంలో విమర్శలు చేసేవాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది.