ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించామని అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని తన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి చెప్పారు.
బడ్జెట్ హైలైట్స్
-2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
-రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
-మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
-రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
-ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా
***
-2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 10.6 శాతంగా నమోదైంది.
***
2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ. 94,776 కోట్లు
-2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ. 22,835 కోట్లు
-2019-20లో ప్రగతి పద్దు రూ. 1,07,302 కోట్లు
-నిర్వహణ పద్దు రూ. 74,715 కోట్లు
-బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు
***
-ప్రతీ పదివేల మందికి ఒక బస్తీ దవఖానా ఏర్పాటు చేస్తాం.
-ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరథ పనుల్ని వందశాతం పూర్తి చేస్తాం.
-మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తాం.
-340 కిలోమీటర్ల రీజినల్ రింగ్‌రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తాం.
-ప్రస్తుతమున్న రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయించాం.
-వచ్చే సంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 గురుకులాలు ప్రారంభం.
-ఎంబీసీ కార్పొరేషన్ కోసం రూ. వెయ్యి కోట్లు
-షెడ్యూల్ తెగల ప్రగతి నిధి కోసం రూ. 9,827 కోట్లు
-షెడ్యూలు కులాల ప్రగతి నిధి కోసం రూ. 16,581 కోట్లు
-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు
-రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు
-రైతు బీమా కోసం రూ. 650 కోట్లు
-కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు
-నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు
-ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు
-గతంలో గుజరాత్, కేరళ అభివృద్ధి నమూనాల గురించే చర్చ జరిగేది. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు.
-తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని విద్యుత్ సమస్యలు పరిష్కరించి చీకటి నుంచి వెలుగుల వైపు పయనించామని అన్నారు.
– రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలంగాణలో అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని ఆయన చెప్పారు.