ప్రస్తుతం తెలంగాణ అంతటా మునుగోడు ఉపఎన్నిక గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం టీ.ఆర్.ఎస్, బీజేపీ పోటాపోటీగా వ్యవహరిస్తూ ఉండటంతో ఇతర పార్టీలు ఈ ఎన్నికల్లో గెలవడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని డైరెక్ట్ గా కామెంట్లు చేయడం గమనార్హం.
ఓడిపోయే పార్టీకి ప్రచారం ఎందుకు అని ఆయన కామెంట్లు చేశారు. నేను ప్రచారంలో పాల్గొన్నా కాంగ్రెస్ కు కేవలం 10,000 ఓట్లు మాత్రమే వస్తాయని అంతకు మించి కలిగే బెనిఫిట్ అయితే ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం. మరోవైపు మునుగోడులో ప్రచారానికి హాజరు కావడానికి కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు.
టీ.ఆర్.ఎస్ వర్గాలు సైతం మునుగోడులో కేసీఆర్ ప్రచారం లేనట్లేనని చెబుతుండటం గమనార్హం. ప్రచారానికి హాజరై పార్టీ ఓడిపోతే పరువు పోతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. కేటీఆర్ మాత్రం మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం చేస్తూ ఇక్కడ పార్టీ గెలవడానికి తన వంతు కష్టపడుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక వల్లే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సైతం దృష్టి పెట్టలేకపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మునుగోడు ఉపఎన్నికలో గెలిస్తే 2024 ఎన్నికల్లో కూడా తమ పార్టీదే విజయం అని ప్రచారం చేసుకోవాలని మరికొన్ని పార్టీలు భావిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత కూడా ఆ ఫలితం గురించి జోరుగా చర్చ జరిగే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు ఎలా ఉన్నా గెలిచిన పార్టీ వల్ల ఇతర రాజకీయ పార్టీలకు టెన్షన్ పడే అవకాశం ఉంటుంది.