తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో దళిత బంధు స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న స్కీమ్స్ లో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ సర్కార్ నిరుపేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తోంది. దళితులను ఎంట్రపెన్యూర్లుగా మార్చాలనే ఆలోచనతో తెలంగాణ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
దేశంలో అమలవుతున్న స్కీమ్స్ లో అతిపెద్ద నగదు బదిలీ స్కీమ్ ఇదే కాగా ఈ స్కీమ్ వల్ల దళితులకు ఎంతో బెనిఫిట్ కలగనుంది. 2021 సంవత్సరం ఆగష్టు నెల 16వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు అవుతోంది. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ స్కీమ్ కోసం లక్ష కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దశలా వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచన కాగా ఈ స్కీమ్ కు అర్హత పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దళితుడు అయిన వ్యక్తే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ స్కీమ్ బెనిఫిట్ పొందాలంటే కుల ధృవీకరణ పత్రం ఉండాలి. తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో పాటు రేషన్ కార్డ్ ఉండాలి.
దరఖాస్తుదారుడికి ఆధార్ ఉండాలి. ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుండగా ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా నచ్చిన వ్యాపారం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహా స్కీమ్స్ వల్ల పేద ప్రజలకు ఊహించని స్థాయిలో లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు.