అచ్చంపేట సర్పంచ్‌కు కేసీఆర్  ఫోన్

హలో నర్సింహ్మగౌడ్ గారు బాగున్నారా.. ఆ బాగున్నాం ఎవరూ.. నేను కేసీఆర్ ను సీఎం సాబ్ ను… సార్ సార్ నమస్తే సార్ …. ఆ అంతా బాగున్నారా.. బాగున్నాం సారు.. ఊళ్లో ఏంటి పరిస్థితి… అంతా క్షేమమే సారు…

అవును మీరు విన్న సంభాషణ తెలంగాణ సీఎం కేసీఆర్, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం వల్కపల్లి సర్పంచ్ నర్సింహ్మల మధ్య జరిగింది. సీఎం ఫోన్ చేయడంతో సర్పంచ్ నర్సింహ్మ షాక్ కు గురయ్యారు. ఇంకా వారిద్దరి మధ్య చాలా సంభాషణే జరిగింది. గ్రామంలో ఎంత మంది జనాభా ఉన్నారు, గ్రామంలో వసతులు  బాగున్నాయా అంటూ సీఎం ఆరా తీశారు. గ్రామ పంచాయతీకి ఎంత కరెంటు బిల్లు వస్తుంది. వీధి లైట్లకు మినహాయించి మిగిలిన వాటికి గ్రామపంచాయతీ నిధుల నుంచి బిల్లులు  చెల్లిస్తే ఎలా ఉంటుందని  సీఎం అడిగారు. 14 వ ఆర్థిక సంఘం నిధులు అందాయా ఎన్ని వచ్చాయని సీఎం అడగగా 8 లక్షలు వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇంటి పన్ను వసూలు చేశామని సీఎం కు సర్పంచ్ తెలుపగా సీఎం అభినందించారు. రైతుబంధు, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్టు, రైతు బీమా, ఆసరా ఫించన్లు, ఇతర పథకాల అమలు గురించి సర్పంచ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎలా పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. బాగానే పనిచేస్తున్నారని తెలుపగా.. బాలరాజుతో కలిసి మా ఇంటికి భోజనానికి రమ్మని కేసీఆర్ సర్పంచ్ ను ఆహ్వానించారు. సీఎం తనతో మాట్లాడుతారని ఊహించలేదని నర్పింహ్మగౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.