హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూతురు వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు హొం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఎంపీ కవిత, రాజ్య సభ సభ్యులు సంతోష్ తదితరులు హాజరయ్యారు. వధూవరులను వారు ఆశీర్వదించారు.