తెలంగాణలో కరోనా కలకలం.. ఒక్కరోజులో భారీగా పెరిగిన కేసులు…!

 

తెలంగాణలో కరోనా కలకలం.. ఒక్కరోజులో భారీగా పెరిగిన కేసులు…!

కరోనా పేరు వింటేనే ప్రజలలో వణుకు పుడుతోంది. చైనాలో ఉద్భవించిన ఈ కరోనా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతె కాకుండా అన్ని దేశాలు ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయాయి. ఈ మహమ్మారి కరోనా మన దేశంలో కూడా విలయతాండవం చేసింది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది కరోనా నుండి బయటపడిన కూడా ఇప్పటీ దీర్ఘకాలిక సమస్యలలో ఇబ్బంది పడుతున్నారు. కరోనా ఒకదాని తర్వాత ఒకటి దాని రూపాలు మార్చుకుంటూ 3 వెవ్స్ లో ప్రజల మీద దాడి చేసింది.

కరోనా మొదటి వేవ్ లో మన దేశంలో ప్రాణ నష్టం ఎక్కువగా లేకపోయినప్పటికీ కరోనా రెండు, మూడు వేవ్ లలో మాత్రం అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ప్రముఖులు, సామాన్యులు అని తేడా లేకుండా ఈ వ్యాధితో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రభుత్వాలు ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడటానికి కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందించింది. అయితే ఈ కరోనా వైరస్ ఇప్పటికి పూర్తిగా నసించలేదు. మనదేశంలో ఇంకా కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక్క రోజులోనే 36,764 కరోనా పరీక్షలు నిర్వహించగా 852 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా థర్డ్‌వేవ్‌ తర్వాత తెలంగాణలో ఒక్కరోజే 800 పైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే కరోనా సోకిన వారిలో 640 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా మరణాలు సంభవవించకపోవటం కొంత ఉరటనిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,915 కరోనా యాక్టివ్‌ కేసులు
ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 8,16,531 కరోనా కేసులు నమోదు కాగా అందులో 8,07,505 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక కరోనా సోకటం వల్ల 4,111 మృతి చెందారు. అయితే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాధి పూర్తిగా నసించలేదని కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం కూడ ఉందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.