మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ అధికారుల దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడులు ఇంకా అవిరామంగా కొనసాగుతున్నాయి. శ్రీమంతుడు నుంచి పుష్ప వరకు అనేక బ్లాక్ బస్టర్లు తీసినా కూడా.. ఏనాడూ ఈ మైత్రీ సంస్థపై ఐటి దాడి అన్నది జరగలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా నాన్ హైదరాబాద్ టీం లు పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది!
అయితే ముంబాయిలో జరిగిన ఓ ట్రాన్సాక్షన్ లింక్ పట్టుకున్న ఐటీ అధికారులు… వాటికి సంబందించిన లింకులు హైదరాబాద్ లో ఉన్నాయని కంఫర్మేషన్ కి వచ్చిన తర్వాత మైత్రిపై దాడులు చేసినట్లు తెలుస్తుంది. అయితే… ఈ ట్రాన్సాక్షన్ మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఇది ఒక భారీ హవాలా ట్రాన్సాక్షన్ అని కథనాలొస్తున్నాయి!
దీంతో… మైత్రికి ఉన్న ముంబై లింకులపై ఢిల్లీ ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారట. ముంబైలోని ఓ ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకొని బాలీవుడ్ లో సినిమాలు నిర్మించాలనుకున్నట్లు ఇప్పటికే గుర్తించిన అధికారులు.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తో డీల్ మాట్లాడుకున్నారని గుర్తించారట. అయితే… ఇందులో భారీగా అడ్వాన్స్ లు అనఫిషియల్ గా ఇచ్చినట్లు గుర్తించారట.
ఇదే క్రమంలో ముంబైలోని ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ అధికారులు రెండ్రోజులుగా సోదాలు జరుపగా… సినిమా డబ్బులతో హైదరాబాద్ శివారులో వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారట. ఈ నేపథ్యంలోనే ట్యాక్స్ చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు తేల్చారట.
ఏది ఏమైనా… మైత్రీ మీద ఐటి దాడుల వ్యవహారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతానికి ఈ దాడులకు సంబందించి వార్తల్లో వాస్తవ అవాస్తవాల పై ఫుల్ క్లారిటీ రావాలంటే… మరి కాస్త సమయం వేచి చూడాల్సిందే!