వరంగల్ టిఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలోనే రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. ఆ గొడవను ఆపడం పోలీసుల వల్ల కూడా కాలేదు.
సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన బహిరంగ సభ జన సమీకరణ కోసం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నెక్కొం డ మండల కేంద్రములో పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఒక కార్యకర్త పెద్ది సుదర్శన్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి పలు మార్లు ఆ కార్యకర్తను వారించారు. అయినా ఆ కార్యకర్త పట్టించుకోకుండా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎదురు మాట్లాడారు. దీంతో రెండు వర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరినొకరు తన్నుకున్నారు.
పార్టీ కార్యకర్తలు గొడవ పడుతున్న వీడియో కింద ఉంది చూడండి.