తెలంగాణ ఎన్నికలపై ఇంటలిజెన్స్ సర్వే రిపోర్ట్ నిజమయ్యేనా ?

తెలంగాణ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. రకరకాల సర్వేలు ఇటు జనాలను, అటు రాజకీయ పార్టీలను కలవర పెడుతున్నాయి. దీంతో ఓటరునాడి అందక సర్వే సంస్థలు విలవిలలాడుతున్నాయి. ఎవరికి తోచినట్లు వారు ఎగ్జిట్ ఫలితాలు, సర్వే ఫలితాలు వెలువరించారు. ఎవరి సర్వే నమ్మాలో తెలియక పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. పైకి తామే గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా… లోలోన మాత్రం భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓటింగ్ పర్సెంటేజీ అమాంతంగా పెరగడం కూడా పార్టీలను కలవరపాటుకు గురిచేస్తున్నది. 

ఈ అన్ని రకాల ఉత్కంఠ పరిస్థితులు మరో 24 గంటల్లో  తేటతెల్లం కానున్నాయి. ఇప్పటి వరకు ఏ పార్టీ గెలవబోతున్నది? ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఎవరి బలాలేంటి? ఎవరి బలహీనతలు ఏంటి? అన్నదానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇక సర్వేల హడావిడి కూడా మామూలుగా లేదు. టిఆర్ఎస్ పార్టీ సర్వేలన్నీ ఆ పార్టీకి వంద సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెబుతున్నది. కూటమిదే అధికారం అని కాంగ్రెస్, టిడిపి పార్టీలు చేసిన సర్వేలు చెబుతున్నాయి. 

ఈ పరిస్థితుల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం వారు చేసిన సర్వే వివరాలు ఆసక్తిని రేపుతున్నాయి. తెలంగాణకు చెందిన సెంట్రల్ ఇంటలిజెన్స్ అధికార వర్గాలు చేసిన సర్వే వివరాలను కేంద్రానికి సమర్పించాయి. ఆ సర్వే నివేదికలను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఉన్న రాజకీయ పరిస్థితి మీద సర్వే చేస్తున్న ఎపి ఇంటలిజెన్స్ వర్గాలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికను కూడా బేరీజు వేస్తున్నాయి.  కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు తెలంగాణ ఎన్నికల మీద చేసిన సర్వే వివరాలు ఇవే. (ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి లీక్ అయిన వివరాలు)

ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడో వివరించింది. ఆ సర్వే. మొత్తం 11 పేజీల సర్వే నివేదికలు కింద ఉన్నాయి చూడండి.

జిల్లాల వారీగా చూస్తే …

ఉమ్మడి జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే రిపోర్ట్

మొత్తం 119 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 58 సీట్లలో, టిఆర్ఎస్ 29 సీట్లలో టిడిపి 9 సీట్లలో, ఎంఐఎం 6 సీట్లలో, బిజెపి 2 సీట్లలో గెలుస్తాయని ఈ నివేదిక వెల్లడించింది. 15 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా (10 సీట్లు) :

కాంగ్రెస్ 8 సీట్లు వస్తాయి. టిఆర్ఎస్ 1 సీటుకే పరిమితం. మరో స్థానంలో పోటాపోటీ ఉంటుందని సర్వే తేల్చింది.

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా (9 సీట్లు) :

కాంగ్రెస్ 4, టిఆర్ఎస్ 4 సీట్లు వస్తాయని తేల్చింది. మరో స్థానంలో పోటా పోటీ ఉంటుంది.

 

కరీంనగర్ ఉమ్మడి జిల్లా (13 సీట్లు) :

కాంగ్రెస్ 7 సీట్లు, టిఆర్ఎస్ 3 సీట్లు గెలుచుకుంటున్నది. మరో మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చింది.

 

మెదక్ ఉమ్మడి జిల్లా (10 సీట్లు ) :

కాంగ్రెస్ 4 సీట్లు, టిఆర్ఎస్ 6 సీట్లు గెలుచుకోబోతున్నట్లు తేల్చింది. ఇక్కడ టఫ్ ఫైట్ లేదని సర్వే తేల్చింది.

 

రంగారెడ్డి ఉమ్మడి జిల్లా (14 సీట్లు) : 

కాంగ్రెస్ 7 సీట్లు, టిఆర్ఎస్ 2 సీట్లు, టిడిపి 4 సీట్లు గెలుస్తుంది. మరో స్థానంలో హోరాహోరీ ఉంటుంది.

 

హైదరాబాద్ జిల్లా (15 సీట్లు) :

కాంగ్రెస్ 2 సీట్లు, టిఆర్ఎస్ 2 సీట్లు గెలుస్తాయి. ఎంఐఎం పా్టీ 6 సీట్లలో గెలుస్తుంది. బిజెపి 2 సీట్లు కైవసం చేసుకుంటుంది. మరో మూడు సీట్లలో తీవ్ర పోటీ ఉంటుంది.

 

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా (14 సీట్లు) :

కాంగ్రెస్ 6 సీట్లు, టిఆర్ఎస్ 3 సీట్లు, టిడిపి 2 సీట్లు గెలుచుకుంటాయి. మరో మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుంది.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా (12 సీట్లు) :

కాంగ్రెస్ 8 సీట్లు, టిఆర్ఎస్ 4 సీట్లు గెలుచుకుంటాయి.

 

వరంగల్ ఉమ్మడి జిల్లా (12 సీట్లు) :

కాంగ్రెస్ 6 సీట్లు, టిఆర్ఎస్ 3 సీట్లు సాధిస్తాయి. మరో మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

 

ఖమ్మం ఉమ్మడి జిల్లా (10 సీట్లు ) :

కాంగ్రెస్ 6 సీట్లు గెలుస్తుంది. టిఆర్ఎస్ 1 సీటుకే పరిమితం అవుతుంది. టిడిపి 3 సీట్లలో గెలుస్తుంది.

 

 నియోజకవర్గాల వారీగా ఏ సీటులో ఎవరు గెలుస్తారో? పోటా పోటీగా ఉన్న సీట్లు ఏవో కింద నివేదికలు ఉన్నాయి చూడొచ్చు.