తెలంగాణాలో తెరాస పార్టీకి చుక్కలు చుపెడుతూ రాబోవు ఎన్నికలలో ప్రజలు మార్పు కనుక కోరుకుంటే అధికారం తమకే సొంతం అనేంతగా బీజేపీ పార్టీ బలపడుతుంది . అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బలపడేందుకు భారీ ప్రణాళికలు వేసి ఇప్పటికే కొన్ని మంచి ఫలితాలను సాధించింది. సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ పార్టీ మునుపటిలా అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇది తమకేం ప్రమాదం కాకపోయినా వైసీపీ, టీ ఆర్ ఎస్ లా లైట్ తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లిచుకోవాల్సిందే.. తెలంగాణా లో అనామకంగా ఉండి బీజేపీపార్టీ ఇప్పుడు ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటాలని భావిస్తుంది బీజేపీ.
దానికి తగ్గట్లే బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది.. కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావాలని సోము వీర్రాజు ని దూకుడు పెంచమన్నట్లు సిగ్నల్స్ పంపిస్తుంది .మొదట్లో కాస్త కాం గా ఉంటూ పెద్దగా ప్రజల నోట్లో నానని సోము ఆ తర్వాత తన చర్యలతో, కార్యచరణలతో పార్టీ ని కొద్ది కాలంలోనే బలోపేతం చేశారు.. దానికి ప్రజలు సైతం ఎంతో ఆశ్చర్య పోయారు.. RSS విధానాలను ఎక్కువగా పాటించే సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దేవాలయాల దాడుల విషయంలో చేసిన హడావుడి అంతా ఇంతాకాదు..
అయితే ఇది వైసీపీ ని కొంత కలవరపరిచేదే..తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ కు తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా రాజధాని అమరావతి తరలింపుపై దీని ప్రభావం పడుతుంది. అందుకే జగన్ తిరుపతి ఉప ఎన్నికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే వైసీపీ తిరుపతి అభ్యర్థిగా గురుమూర్తిని ఏకపక్షంగా జగన్ నిర్ణయించారని పార్టీలు గుసగుసలు వినపడుతున్నాయి. నేరుగా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టకున్నా కొందరు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. వీటన్నిటికీ జగన్ ఏవిధంగా చెక్ పెడతారో చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి.