Kavitha: రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు ఎలా పెడతావో చూస్తా… రేవంత్ కు వార్నింగ్ ఇచ్చిన కవిత!

Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీసీలకు ఎన్నికల హామీల ముందు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఇవ్వకుండా స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో చూస్తాను అంటూ ఈమె తనదైన శైలిలోనే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు బీసీ సంఘాలతో ఆమె సమావేశం అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బీసీల జనాభా ఎంత ఉంది అనే విషయం తెలియకుండానే హామీలు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారన్నారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లను కల్పించినప్పుడే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని అలా కాదని ఎన్నికలను నిర్వహిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కవిత హెచ్చరించారు.

మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని అప్పటివరకు ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలు మానుకోవాలని ఈమె సూచనలు చేశారు జనవరి మూడో తేదీ సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామని ఈ సభ వేదికగా జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీల రిజర్వేషన్లను కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే కవిత ఈ ఎన్నికలపై స్పందిస్తూ కామెంట్లు చేశారు.

LIVE : MLC Kavitha Press Meet | Banjara Hills | BRS Live Feed