KTR: నాకు బెయిల్ కూడా అవసరం లేదు… ఏసీబీ కేసు పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ఆయన తమ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతిపై పెద్ద ఎత్తున విచారణలను జరిపిస్తున్నారు ఏదో ఒక కేసులో తనని అరెస్టు చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు కేటీఆర్ పై కేసు నమోదు చేసింది..ప్రపంచ ఖ్యాతి పొందిన ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌కు తీసుకువచ్చి విజయవంతంగా నిర్వహించిన అంశంపై అవినీతి నిరోధక శాఖపై కేసు నమోదు చేయడంతో తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ కార్ రేస్ విషయంలో పెద్ద ఎత్తున డబ్బును వృధా చేశారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో కేటీఆర్ ఏ1 ముద్దాయిగా కేసు నమోదు కాగా ఐఏఎస్ అధికారిపై కూడా కేసు నమోదు అయింది అయితే తాజాగా తనపై నమోదు అయిన ఈ కేసు విషయంపై కేటీఆర్ స్పందించారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తారనే వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కేసు నమోదు కావడంతో తాను ముందస్తు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోనని.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాల్‌ చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేటీఆర్ ఇదే విషయం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వారాంతంలో తన అరెస్ట్ ఉండవచ్చని అయినప్పటికీ తాను ఏ దేనికి భయపడేది లేదని తెలిపారు. మీకు ఇష్టం వచ్చినది చేసుకోండని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ విషయంలో తాను ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకోనని తెలిపారు.

ఇలా మీడియాతో మాట్లాడటానికి కంటే ముందుగానే ఈయన అసెంబ్లీలో కూడా ఇదే విషయం గురించి మాట్లాడారు.నాపై ఏదో కేసు నమోదు చేశారని ఇప్పుడే మా సభ్యులు చేబుతున్నారు. ప్రస్తుతం సభ నడుస్తున్న సందర్భంగా స్పీకర్‌కు కోరుతున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ది ఉంటే చర్చకు సిద్దంగా చర్చ పెట్టాలనీ కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇక ఈయనపై కేసు నమోదు కావడంతో ఏ క్షణమైన అరెస్టు కావచ్చని తెలుస్తోంది.