అక్బరుద్దీన్ ఒవైసీ, 8 ఆసక్తికరమయిన విశేషాలు

పోలిటిషన్ అబద్దాలు చెప్పడం నామినేషన్ వేయడంతో మొదలవుతుంది. అది ఇంక ఎపుడూ ఆగదు.

అందుకే రాజకీయాల్లో అబద్దాలే నిజాలుగా చలామణి అవుతుంటాయి.జనం కూడా వాటినే నమ్ముతుంటారు. చప్పట్లుకొడుతుంటారు, ఈలలేస్తుంటారు.డ్యాన్స్ లేస్తారు. టివి చర్చల్లో మేధావులు మద్దతుగా  వాదిస్తారు.  రాజకీయ వ్యాఖ్యాతలు వ్యాసాలు రాసి బలపరుస్తారు. అమాయకులయితే, అవసరమయితే ఈ అబద్దాలకోసం ప్రాణాలు కూడా పొగొట్టుకుంటుంటారు. 

నామినేషన్ వేసేటపుడు తన ఆస్తిపాస్తుల గురించి, కేసుల గురించి, తనకు పడిన శిక్షల గురించి ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులంతా ఒక అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడే అబ్దాలకు, నిజాలు దాచేందుకు బీజాలు పడతాయి. ఈ అఫిడవిట్ లో చాలా అబద్దాలుంటాయి. అవి నిజాలను తొక్కిపెడుతూ ఉంటాయి. దీనికి ఎవరూ అతీతులు కాదు, అందుకే పొలిటీషన్ పాలిటిక్స్ ఇలా అబద్దాలతో మొదలవుతాయి. అబద్దాలతోనే ఎండవవుతాయి.

అయితే, ఎన్నిఅబద్దాలు చెప్పినా  కొన్ని నిజాలు తప్పించుకోలేవు. వాటిని ఆఫిడవిట్ లో చేర్చక తప్పదు. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిన్న హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మజ్లీస్ పార్టీ (ఎఐఎంఐఎం)తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇపుడు చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే. ఆయన కమిషన్ సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న ఆసక్తి కరమయిన విశేషాలు:

  1. ఆయన మీద 14 క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో ఎక్కువ భాగం మతవిద్వషాలు రెచ్చగట్టిన ఫిర్యాదులకు సంబంధించినవి.
  2. కొన్ని కేసుల నిషేధపుటుత్తర్వులను ఉల్లంఘించడానికి సంబంధించినవి.
  3. అక్బరుద్దీన్ మీద మత విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులు నిజామాబాద్, చాంద్రాయణ గుట్ట, లంగర్ హౌజ్, నాంపల్లి,సంతష్ నగర్,ఎల్ బి నగర్ (హైదరాబాద్ పరిధిలో),  నిర్మల్ (పాత ఆదిలాబాద్ జిల్లా), వనపర్తి (పాత మహబూబ్ నగర్ జిల్లా),హుమ్నాబాద్ (కర్నాటక), కిషన్ గంజ్ (బీహార్), కడప (ఆంధ్రప్రదేశ్) బొకారో (ఝార్ఖండ్), కుర్ల (ముంబాయ్).
  4. అక్బరుద్దీన్, ఆయన భార్ సబీనా ఫర్జానాలకు రు. 18.5 కోట్ల విలువయిన ఆస్తిపాస్తులున్నాయి.
  5. గత నాలుగు సంవత్సరాలలో ఆయన ఆదాయం బాగా పెరిగింది. 2013-14 లో ఆయన వార్షికాదాయం రు. 53 లక్షలుంటే,  అది ఇపుడు రు. 1.9 కోట్లకు పెరిగింది.
  6. అక్బర్ కు , భార్యకు కలిపి 11.3 కోట్ల అప్పులున్నాయ్.
  7. చదువుకు సంబంధించి గుల్బర్గా లో ఎంబిబిఎస్ చదవుతూ మధ్యలో వదిలేశారు.
  8. ఆయనకు వారసత్వంగా రు. 22 వేల విలువయిన .22 పిస్టల్ వచ్చింది. ఇది కాకుండా మరొక రు. 20 వేల విలువయిన రైఫిల్, రు.11,450 ఖరీదయిన 12 బోర్ డిబిబిఎల్ గన్ కూడా ఉన్నాయి.