వారి వద్ద నుంచి కాంగ్రెసోళ్లకు మామూళ్లు : హరీష్ రావు

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకంగా మారిందని  మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. విద్యుత్ ప్లాంట్లు, ప్రాజెక్టులు కడతామంటే కోర్టు కేసులతో అడ్డుపడుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామంటే కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారని చెప్పారు.‌ ప్రగతి నిరోధకులుగా కాంగ్రెస్ మారడం వల్లే ప్రజల‌ విశ్వాసం కోల్పోయారని చెప్పారు. శుక్రవారం కూకట్ పల్లి లో పది కోట్లతో నిర్మించనున్న ఆధునిక రైతు బజార్ ను మంత్రి హరీశ్ రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

కూకట్ పల్లి రైతు బజార్ ను కార్పోరేట్  సౌకర్యాలతో 50 వేల ‌చదరపు  అడుగుల వైశాల్యంలో  నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఆరు నెలల్లో రైతు బజార్ ను పూర్తి చేస్తామన్నారు. రెండు పడక గదుల‌ ఇళ్లు, మెట్రో, అవుటర్ రింగ్ రోడ్ వంటి‌ అభివృద్ధి పనులతో హైదరాబాద్ ముఖచిత్రం మారిందన్నారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ రాష్ట ప్రజలకు అందుతోందన్నారు. 24 గంటల విద్యుత్ కారణంగా ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం దివాళా తీసిందని, కాంగ్రెస్ పార్టీ సైతం‌ దివాలా తీసిందన్నారు. తెలంగాణ ఇస్తే రాష్ట్రం చీకటవుతుందని ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, చివరికి కాంగ్రెస్ పార్టీ చీకటిగా మారిందని ఎద్దెవా చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పేకాట క్లబ్ లు,‌ గుడుంబా వ్యాపారుల వద్ద కాంగ్రెస్ నేతలు మామూళ్లు వసూలు చేసేవారని చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే పేకాట క్లబ్ లు, గుడుంబా వ్యాపారాన్ని మూయించారని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. కృష్ణా, గోదావరి, మంజీర మూడు నదుల నీళ్లు అందుతున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనన్నారు. ఈ మూడు నదుల్లో నీరు తగ్గినా , కాళేశ్వరం నీటిని లింక్ చేస్తే వందేళ్ల దాకా హైదరాబాద్ కు  నీటి సమస్య ఉండదన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజల తాగు నీటి అవసరాలు తీర్చేందుకు రెండు‌ రిజర్వాయర్లను నిర్మిస్తున్నారని చెప్పారు.

మంత్రి కేటీఆర్ రాత్రింబవళ్ళు కష్టపడి లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. వేసవి వస్తే గతంలో కుండలతో జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నాలు‌చేసే‌ వారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి దృశ్యాలు‌లేవని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున ఖాళీ కుండలు, క్యాండిళ్లు, లాంతర్లతో , ఎండిపోయిన కంకులతో ప్రదర్శనలు ‌చేసేవారు. ఈ నాలుగేళ్ళ లో‌అలాంటి దృశ్యాలు తమ ప్రభుత్వ హయాంలో కనబడలేదన్నారు. కరెంటు కోసం, తాగు నీటి కోసం ఒక్క రోజు ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. ఇక మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలీవరి చేస్తే 12 వేల రూపాయలు, కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆటో ఖర్చు ‌లేకుండా‌ తల్లిని, పిల్లని‌ఇంటి వద్దే ప్రభుత్వమే దింపుతోందన్నారు.  రెండు‌లక్షల యాభై వేల‌ కేసీఆర్ కిట్లు పేద మహిళలకు‌ అందాయన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ పేరుతో ఉచిత వైద్య పరీక్ష లు‌‌ చేస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఈ సేనలు ‌విస్తరింప జేయనున్నట్లు‌ మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్షంగా నిలిచిందన్నారు.‌శాంతిభద్రతలు, పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కరెంచ్, నీరు , రైతులకు పంట పెట్టుబడి, రైతు బీమా వంటి వాటిల్లో రాష్ట్రన్ని సీఎం కేసీఆర్ మొదటి‌స్థానంలో‌ నిలిపారని చెప్పారు. మిషన్ భగీరథ వంటి పథకాన్ని తమ రాష్ట్రంలోను అమలు‌చేయాలని కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ప్రజలు డిమాండ్ చేయడం మన ప్రభుత్వ పని తీరుకు,‌సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి నిదర్శనమన్నారు.