ఈ తెలంగాణ పెద్ద మనిషి ఎవరో గుర్తు పట్టగలరా?

ఫొటోలో కనబడుతున్న మనిషిని ఎక్కడో చూసినట్లు గుర్తుంది కదూ. ఈయన తెలుగు మనిషా లేక ఖాన్ సాబా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారా? ముస్లింలు వాడే టోపీ ధరించేసరికి గుర్తుకు వస్తలేదా? ఈ తెలంగాణ పెద్ద మనిషి ఎవరో మీకు ఈపాటికే అర్థమై ఉంటది కదా? అయితే వివరాలు చదవండి.

బక్రీద్ శుభాకాంక్షలు చెబుతున్న మంత్రి హరీష్ రావు

ఈ ఫొటోలో కనబడుతున్న పెద్ద మనిషి ఎవరో కాదు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి హరీష్ రావు గారు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్యాగాల పునాదులపైన తెలంగాణ ఏర్పడిందని.. పండుగలు సంస్కృతి ని ,సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు , బక్రీద్ పండుగ ఖుర్బానీతో ప్రతి పేదవాని ముఖం లో అనందాన్ని నింపుతుందని , పండుగలు ఐక్యమత్యానికి, సోదరభావానికి ప్రతీక అని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం షాదీముబారక్ , మైనార్టీ గురుకులాలు , ఓవర్ సిస్ స్కాలర్ షిప్ స్కిం , ఉర్దూ భాషను మొదటి లాంగ్వేజ్ అప్షన్ గా గుర్తింపు లాంటి సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టి ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు..ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో , ఆనందోత్సవాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు..