ఇబ్రహీంపట్నంలో రియాల్టర్లపై కాల్పులు.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. కర్ణంగూడ దగ్గర రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రఘపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. రఘు ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన రియాల్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన వ్యక్తి.