బండారు దత్తాత్రేయ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్గొండ కు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో నల్గొండ కు గవర్నర్ దత్తాత్రేయ బయల్దేరి వెళ్లారు.

అయితే రెండు రోజుల క్రితం యాదాద్రి పర్యటనకు వచ్చిన దత్తాత్రేయ కు భువనగిరి పట్టణంలో ఘన స్వాగతం పలికారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, కార్యకర్తలు. అయితే మరికాసేపట్లో పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో గవర్నర్ దత్తాత్రేయకి పౌర సన్మానం జరగనుంది.