తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి ఉంది. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. మరి ఎన్నికల వేళ మందుబాబులు బాధపడే సందర్భాలుంటాయి. మందు అందుబాటులో ఉండదు అన్న ప్రచారం ఉంటది.
కానీ తెలంగాణ ఆబ్కారీ శాఖ మద్యం ప్రియులకు తీపి కబురు అందించింది. ఎన్నికల వేళ మద్యం ప్రియులు ఎలా తాగాలి? ఎంత తాగాలన్నదానిపై క్లారిటీ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ లో భాగంగా మందు బాబులకు ఒక్కరికి 6 ఫుల్ బాటిల్ లు, 12 బీర్లు తీసుకపోయే వెసులుబాటు కల్పించారు. అంతలోపు మద్యాన్ని తరలిస్తే పోలీసులు కానీ, ఆబ్కారీ శాఖ వారు కానీ ఏమనరు. పోలీస్ శాఖ,ఆబ్కారీ శాఖ ఇద్దరూ అనుమతి ఇస్తారు. కానీ అంతకంటే ఎక్కువ తీసుకపోతే సీజ్ చేస్తారు.
ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ వివరణ :
ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాలు చదవండి. ఎన్నికల ఏర్పాట్లలో బాగంగా ఆబ్కారీ శాఖ తీసుకోవాల్సిన చర్యలపై రజత్ కుమార్ తో చర్చించాం. 22న కేంద్ర ఎన్నికల కమిషన్ వస్తున్నందున.. ఈరోజు సీఈఓ తో కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది.
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాము. తెలంగాణ బార్డర్ ల దగ్గర ఆరు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం. మన పొరుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించి మధ్యం అక్రమరవాణ కాకుండా చూస్తున్నాం.
6 బార్డర్ మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేశాం మేము మా ఆబ్కారీ శాఖ పోలీస్ శాఖ తో సమన్వయం చేసుకొని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం. మన తెలంగాణలో ఎలాంటి సమస్య లేదు . దసరా పండుగ తరువాత ఎన్నికల ఏర్పాట్లు మరింత వేగం పెంచుతాం.