గ్రేటర్ వార్ : కౌంటింగ్ ప్రారంభం … మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు‌ !

ghmc

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కబెడతారు . ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేస్తారు. ఈ సారి బ్యాలెట్ పత్రాలు కావడంతో కౌంటింగ్ ప్రక్రియ కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ghmc elections 2020 in telangana

మొదట బ్యాలెట్ బాక్సుల్లో నుంచి బ్యాలెట్ పేపర్లను తీసి 1000 చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు 1,926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్ సమయానికి వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకుని తొలుత వాటిని లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి లెక్కింపు ప్రారంభిస్తారు.

కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.