దేవుడి దర్శనం కోసం వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం?

ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య రోజుకి పెరుగుతుంది. ఈ ప్రమాదాల వల్ల అభం, శుభం తెలియని చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

వివరాలలోకి వెళితే…హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు గిరీధర్‌ కుటుంబ సభ్యులతో సహా కర్ణాటకలోని కలబురగి జిల్లా గంగాపూర్‌కు చెందిన దత్తాత్రేయ స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌ నుండి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో మొత్తం 10 మంది కుటుంబసభ్యులు ఒకే కారులో బయలుదేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని బీదర్ సమీపంలోని బంగూర్ జాతీయ రహదారి పై వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్ ను వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. దీంతో కారు మొత్తం బాగా డ్యామేజ్ అయ్యింది.

ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారితో సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరొక ఐదు మంది తీరగాయాల పాలవటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.